తెలుగుదేశం పార్టీలోఉంటం నేరమా… మహిళ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం !!

THE NEWS INDIA(TNI 24 NEWS NETWORK)...గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ కోడలు, టి డి పి మహిళ  నాయకురాలు ఆత్మహత్య చేసుకుంటానని పురుగు మందుల డబ్బాతో బెదిరింపులకు పాల్పడ్డారు . ప్రతి ఏటా దీపావళి మందుల స్టాల్స్ను ఏర్పాటు చేసుకుంటామని  నిబంధనల ప్రకారం  పర్మిషన్  రావాల్సి ఉండగా.. అధికారులను బెదిరించి పర్మిషన్ రాకుండా  స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తనయుడు కోడెల శివరాం అడ్డుపడుతున్నారని , మరణమే శరణ్యమని , ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని ఆమె వాపోయారు. కోడెల శివరామకు మాపై అంత కక్ష ఎందుకని ఆమె నిలదీశారు, దేశం కార్యకర్త అయినా నా పైనే కక్ష ధోరణి అవలంబిస్తే, సామాన్య మానవుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.   ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని… మేము ఎప్పటినించో టి డీ పి పనిచేస్తున్నాం కానీ మాకే న్యాయం జరగలేదు ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు అని పార్టీ వల్ల చాలా నష్టపోయాం అని వాపోయారు.

కొప్పాడ నాగరాజు., స్టేట్ బ్యూరో.

Related posts

Leave a Comment