రేపు మహిళా రైతు దినోత్సవం సదస్సు..

THE NEWS INDIA(TNI 24 NEWS NETWORK)…వ్యవసాయంలో మహిళల భాగస్వామ్యంపై వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఆధ్వర్యంలో మహిళా రైతు దివస్‌(మహిళా రైతు దినోత్సవం)ను పురస్కరించుకుని సోమవారం ఉదయం 10.30గంటలకు స్థానిక అంబేడ్కర్‌ భవనంలో మహిళా రైతులకు సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ పథక సంచాలకులు దొరసాని  ఒక ప్రకటనలో తెలిపారు. సాగులో ఎదురవుతున్న సమస్యలు, ఆధునిక పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, చిరుధాన్యాల సాగు విస్తరణపై ఈ సదస్సులో అవగాహన కల్పిస్తామన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖల్లో అధిక ఉత్పత్తులు సాధించిన పది మంది మహిళా అభ్యుదయ రైతులకు అవార్డులు ప్రదానం చేస్తామని చెప్పారు. మహిళా రైతులు హాజరై సదస్సును విజయవంతం చేయాలని ఆమె కోరారు.

అరవింద్ రెడ్డి ,
రాయలసీమ జోన్ ఇంచార్జ్ .

Related posts

Leave a Comment