ఇక మద్యం హోమ్ డెలివరీ…

THE NEWS INDIA(TNI 24 NEWS NETWORK)…ఆన్ లైన్… ఆన్ లైన్… ఆన్ లైన్… ఆన్ లైన్ కు అలవాటు  పడిన జీవితం …మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు.. చివరికి కూరగాయలు, కిరాణ సరుకులు కూడా మన ఇంటికే డెలివరీ అవుతున్నాయి. ఇలా ఈకామర్స్‌ సైట్లలో ఆర్డర్‌ చేయగానే.. అలా అవి మన ఇంటికి వచ్చేస్తుంటాయి. అయితే ఈ జాబితాలోకి త్వరలో మద్యం కూడా చేరిపోనుందట. వినడానికి ఆశ్యర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. మన దేశంలో తొలిసారిగా మహారాష్ట్రలో మద్యాన్ని హోండెలివరీ చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమచారం.

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు పెరిగి రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని నేరుగా ఇంటికే సరఫరా చేసేందుకు యోచిస్తోంది. ఇలాంటి చర్య మద్యం పరిశ్రమలో వినూత్న మార్పులు తీసుకురానుందని ఆ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్‌ బావాంకులే అన్నారు. దేశంలో ఈకామర్స్‌ వ్యవస్థ ఎలా నడుస్తుందో ఇది కూడా అలాగే ఉంటుందని ఆయన వివరించారు. ‘ప్రజలు కూరగాయలు, కిరణాసరుకులను ఎలా ఇంటికి తెప్పించుకుంటున్నారో అలాగే ఇది కూడా’ అని పేర్కొన్నారు.

అయితే ఎవరికిపడితే వారికి మద్యం సరఫరా కాకుండా కొన్ని నిబంధనలు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. కనీస వయస్సు, ఆధార్‌ వివరాలు తీసుకుని నిర్ధారించుకున్నతర్వాతే అమ్మకందారుడు వినయోగదారులకు మద్యాన్ని హోండెలివరీ చేస్తారు. అలాగే ప్రతి మద్యం సీసాకు జియోట్యాగింగ్‌ ఉంటుంది. దీని ద్వారా తయారీ దశ నుంచి వినియోగదారునికి చేరే వరకూ మొత్తం వివరాలను ట్రాక్‌ చేయొచ్చని చంద్రశేఖర్‌ వివరించారు. అలాగే నకిలీ మద్యం అమ్మకాలు, స్మగ్లింగ్‌లాంటి ఘటనలు దీంతో తగ్గుతాయని తెలిపారు.

Related posts

Leave a Comment