రాష్ట్ర స్థాయి రెస్లింగ్ పోటిలలో బంగారు పతకం సాధించిన …. లోహిత!!

THE NEWS INDIA(TNI 24NEWS NET WORK)…రేణిగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధిని రాష్ట్ర స్థాయి రెస్లింగ్ పోటిలలో బంగారు పతకం సాదించింది. రాష్ట్ర స్థాయిలో జరిగిన రెస్లింగ్ పోటిలలో రేణిగుంట పట్టణం వడ్డిమిట్టకు చెందిన లోహిత  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది.తిరుపతి లో శనివారం,ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి పోటిలలో అండర్-19 లో 59కిలోల విభాగంలో లోహిత బంగారు పతకం సాదించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విష్ణువర్ధిని,పిడి రేఖ మాట్లాడుతూ తమ విద్యార్ధినులు విద్యతో పాటు ఆటలలో కూడా రాష్ట్ర స్థాయి,జాతీయ స్థాయిలో తన పాఠశాలకు గుర్తింపు తెస్తునందుకు చాల ఆనందంగా ఉందని తెలిపారు. లోహిత రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే నెల హర్యానా రాష్ట్రం లో జరిగే జాతీయ స్థాయి రెస్లింగ్ పోటిలలో పాల్గొనటానికి శిక్షణ పొందుతోంది అని పిడి రేఖ తెలిపారు.

Related posts

Leave a Comment