సీమాంధ్రుల… దారెటు….!!!

సీమాంధ్రుల… దారెటు….!!! 

రాష్ట్రం విడిపోయిన తరువాత సీమాంధ్రుల పరిస్థితి అధోగతి పాలు అయింది, మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత  సీమాంధ్రుల పరిస్థితులను చక్కదిద్దేందుకు ఉమ్మడి రాష్ట్రంగా పది సంవత్సరాలు ఉండే విధంగా విభజన చట్టం చేశారు. దానికి బాధ్యునిగా రాష్ట్ర గవర్నర్ వ్యవహరిస్తారు. ప్రాంతాలుగా…విడిపోయి తెలుగు ప్రజలుగా కలిసి ఉందాం అంటే, “భాష యందు యాస “సమస్యగా మారింది.

29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర ప్రజలు  హైదరాబాద్, రంగారెడ్డి మరియు ఎనిమిది జిల్లాల్లో సుమారుగా కోటి మంది వున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత  మొట్టమొదటి గ్రేటర్ ఎలక్షన్లు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ” ప్రాంతాలు వేరైనా భాష ఒక్కటే” నినాదంతో ” సీమాంధ్రుల ఐక్యవేదిక “ భరోసా ఇచ్చి , 90% ఓటు బ్యాంకును టిఆర్ఎస్ ఖాతాలో జమ చేసి వంద సీట్లు గెలిచి మేయర్ పీఠాన్ని టిఆర్ఎస్ పార్టీ కి కానుకగా ఇచ్చారు. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం సీమాంధ్రులకు ఏ విధమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పూర్తిస్థాయిలో అందిన దాఖలాలు లేవు. తదనంతరం టిఆర్ఎస్ ప్రభుత్వం  సీమాంధ్రులను విస్మరించి, రాజ్యసభ, శాసనమండలి కార్పొరేషన్ చైర్మన్, పలు ప్రభుత్వ పదవులు, తెలంగాణ రాష్ట్ర సమితి  పార్టీ పదవుల్లో గుర్తింపు ఇవ్వలేదని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువెళితే, సీమాంధ్ర సెట్లర్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇచ్చాం కదా అని వారి వాదన.

హైదరాబాద్ మహానగరం సీమాంధ్రులను తల్లివలె అక్కున చేర్చుకుని ఆదరించింది. పెద్దన్న పాత్ర లో “ముస్లిం సోదరులు” సీమాంధ్రులకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. దానిలో భాగంగా సీమాంధ్రులు కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెంది భారీ స్థాయిలో వ్యాపారాలను హైదరాబాద్ నగరంలో  విస్తరింపచేశారు. నగర అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు.
ఇకపోతే సెటిలర్స్ అంటే  మూడు నాలుగు తరాల ముందు వచ్చిన వారు  సెటిలర్స్ ఎలా అవుతారు ? తెలంగాణ బిడ్డ లెక్కనే అని సీమాంధ్ర ప్రజల మనోగతం.  రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అయితే సీమాంధ్ర ప్రజల సంక్షేమo,అభివృద్ధి , ఉద్యోగ అవకాశాలు,  జనాభా దామాషా ప్రకారం సీట్లు, పదవులు కేటాయిస్తామని హామీ ఇచ్చే పార్టీకి ఈ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని సీమాంధ్రుల ఐక్యవేదిక ఈ సందర్భంగా తెలియజేసింది .

తెలంగాణ రాష్ట్ర సీమాంధ్రుల ఐక్యవేదిక… డిమాండ్స్ !!

1) ఆంధ్ర రాష్ట్రంలో బీసీలుగా గుర్తింపు పొంది  తెలంగాణ రాష్ట్రం హైదరాబాదలో నివసిస్తున్న గవర, కళింగ, తూర్పు కాపు ,శెట్టిబలిజ ,మరియు 22 ఉపకులాలు తొలగించబడ్డాయి. వారికి మరల బిసి స్టేటస్ పునరుద్ధరించాలి.   

2) సీమాంధ్రులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.

3) తెలంగాణ ప్రభుత్వం జోనల్ వ్యవస్థను తీసుకురావడం వలన  సీమాంధ్ర విద్యార్థులు, యువకులు,నిరుద్యోగులు, ఉద్యోగ అవకాశాలు నష్టపోతాం. సీమాంధ్రులకు నష్టం లేకుండ పునర్ పరిశీలన చేసి  న్యాయం చేయాలి

4) విభజన చట్టంలో పది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నందున, తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రల అభ్యున్నతికి  జాతీయ రాజకీయ పార్టీలు కృషి చేయాలి.

5) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు  సంక్షేమ అభివృద్ధి  కార్పొరేషన్లు నెలకొల్పడం జరిగింది.  ఆయా కార్పొరేషన్లు  ద్వారా ఆయా సామాజిక వర్గాలు ఏ విధమైన లబ్ధి పొందుతున్నారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లో నివసిస్తున్న సీమాంధ్రులకు  వెసులుబాటు కల్పించి ,తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ను విడుదల చేయాలి.

 తెలంగాణ రాష్ట్ర సీమాంధ్రుల ఐక్యవేదిక .

అధ్యక్షులు.

సంగినీడి సీతారాం.

ప్రధాన కార్యదర్శి,

బొర్రా శివరామ ప్రసాద్ చౌదరి.

seemandra Aikya Vedika.

6-2-40,dollar chambers

4th floor, Flat no-3,

A.c guards,lakdi-ka-pool. Hyderabad.

500004,Telangana state.

cont…8977399999.

9966698666.

 

 

 

Related posts

Leave a Comment