మోదీ మాటలతో దేశ ప్రజలంతా మోసపోయారు: చంద్రబాబు ఫైర్

anuemmanuel latest project updates

బాబ్లీ అంశంతో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ చెప్పింది ఒకటి, చేసింది మరొకటని ఆయన మండిపడ్డారు. మోదీ మాటలు నమ్మి దేశ ప్రజలంతా మోసపోయారని అన్నారు. మోదీ విధానాలతో అమెరికా డాలరుతో పోల్చితే రూపాయి విలువ నానాటికీ దిగజారుతోందని మండిపడ్డారు.

డాలరు విలువ త్వరలోనే రూ. 100కు చేరుకోబోతోందని దుయ్యబట్టారు. పెట్రో ధరలు కూడా రూ. 100కు దగ్గరవుతున్నాయని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందకున్నా… స్వశక్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళుతున్నామని చెప్పారు. కేంద్రంలో మోదీ పాలన పోతేనే దేశానికి మంచి జరుగుతుందని అన్నారు.

Tags: chandrababu naidu, latest comments, modi government

Related posts

Leave a Comment