‘యూటర్న్’ నుంచి ఆకట్టుకుంటోన్న ప్రమోషనల్ సాంగ్

సమంత ప్రధాన పాత్రగా ‘యూటర్న్’
ముఖ్యపాత్రలో భూమిక
ఈ నెల 13న విడుదల
సమంత ప్రధాన పాత్రగా ‘యూటర్న్’ సినిమా రూపొందింది. 2016లో కన్నడలో వచ్చిన ‘యూటర్న్’కి ఇది రీమేక్. అక్కడ ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించడంతో, తెలుగులోకి రీమేక్ చేశారు. ముఖ్యమైన పాత్రలో ఆది పినిశెట్టి .. రాహుల్ రవీంద్రన్ .. భూమిక నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను, ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ఒక ప్రమోషనల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఆల్బమ్ తరహాలో ఈ ప్రమోషనల్ సాంగ్ ను అనిరుధ్ ఆలపిస్తుండగా .. సమంత డాన్స్ చూపించారు. అలాగే సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాల బిట్స్ ను కూడా ఈ సాంగ్ కి జోడించారు. “దిశల్ని మార్చుకున్నా .. ఎలాంటి దారుల్లో పోతున్నా .. మనస్సు మారుతున్నా .. గతాల జ్ఞాపకం ఏదైనా” అంటూ ఈ సాంగ్ కొనసాగుతోంది. ‘కర్మ థీమ్’ పేరుతో నెటిజన్ల ముందుకు వచ్చిన ఈ సాంగ్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలవుతోన్న ఈ సినిమా, ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో చూడాలి .

Related posts

Leave a Comment