నందమూరి హరికృష్ణ దుర్మరణం.. శోక సంద్రంలో అభిమానులు!

  • కారు ప్రమాదంలో తీవ్రంగా గాయాలు
  • ఆసుపత్రి వద్ద పోలీసుల బందోబస్తు

తన అభిమాని కుమారుడి వివాహ వేడుక నిమిత్తం బయలుదేరిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ, ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తలకు బలమైన గాయం కారణంగా, ఆసుపత్రికి తరలించేలోపే చాలా రక్తం కోల్పోవడంతో చికిత్సకు స్పందించని ఆయన, కొద్దిసేపటిక్రితం మరణించారని కామినేని వైద్య వర్గాలు వెల్లడించాయి. ‘ఏపీ 28 బీడబ్ల్యూ 2323’ నంబరుగల కారులో మరో ముగ్గురితో కలసి హరికృష్ణ ప్రయాణిస్తున్న వేళ, ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. హరికృష్ణ మృతి వార్త విని నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. టీడీపీ అభిమానులు కామినేని ఆసుపత్రి వద్దకు పెద్దఎత్తున చేరుకుంటుండటంతో పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, బందోబస్తును పెంచారు.

Related posts

Leave a Comment