ఎంపీ కవితను కలిసిన బ్రిటీష్ హై కమిషన్

mpkavitha britesh high commisition meet

 

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధి పనుల గురించి కైరన్ డ్రాకే, ఆండ్య్రూ ఫ్లెమింగ్‌కు కవిత వివరించారు. దశాబ్దాల కల అయిన రైలు సౌకర్యం కల్పించాలని, పసుపు బోర్డు ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నాల గురించి చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించామని, తద్వారా ప్రజలకు ఆర్థికపరమైన భారం తప్పిందన్నారు. నిజామాబాద్ జిల్లా ను అభివృద్ధి పథంలో ముందంజలో నిలిపేందుకు ఎంపి కవిత చేస్తున్న కృషిని వారు ప్రశంసించారు. ఎంపీ కల్వకుంట్ల కవితను ఆమె నివాసంలో ఢిల్లీలోని బ్రిటీష్ హై కమిషన్ రాజకీయ, మీడియా విభాగాధిపతి కైరన్ డ్రాకే, డిప్యూటీ హైకమిషనర్(తెలంగాణ, ఏపీ) ఆండ్య్రూ ఫ్లెమింగ్, రాజకీయ, ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్‌లు కలిశారు.

 

Tags: mp kavitha , nizamabad , kairandrake , britesh high commision ,

Related posts

Leave a Comment