చంద్రబాబుపై కేసులు వేస్తాం: బీజేపీ నేత

THE NEWS INDIA(TNILIVET.V)… చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లాలో నిర్మించనున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ ను రియల్ ఎస్టేట్ సెజ్ గా మార్చాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భోగాపురం నుంచి బాత్రూమ్ ల వరకు చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని, ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకొచ్చినా జీఎంఆర్ కు కట్టబెట్టాలని చూశారని, భోగాపురం, కర్నూలు, ఓర్వకల్లు, నెల్లూరు ఎయిర్ పోర్ట్ లను చంద్రబాబు వ్యాపారమయం చేస్తున్నారని ఆరోపించారు.

భోగాపురం టెండర్ డాక్యుమెంట్ విషయమై కేంద్ర మంత్రిని కలిసిన సంగతిని ఆయన ప్రస్తావించారు. ఉపాధి హామీ దోపిడీపైనా కేంద్రానికి ఫిర్యాదు చేశామని, కేంద్ర పథకాలు ఏపీకి ఉపాధి హామీల్లా మారాయని, చంద్రబాబుపై కోర్టుల్లో కేసులు వేసేందుకు ప్రయత్నిస్తున్నామని, సీబీఐ విచారణ కోసం కోర్టులకు వెళ్తామని సోము అన్నారు.

Related posts

Leave a Comment