భారీ చారిత్రక చిత్రంలో జాన్వీ కపూర్ .. బడ్జెట్ 500 కోట్లు

కరణ్ జొహార్ నిర్మాతగా చారిత్రక చిత్రం
కథానాయకుడిగా రణ్ వీర్ సింగ్
కథానాయికలుగా కరీనా .. అలియా భట్
తొలి చిత్రంతోనే జాన్వీ కపూర్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నటన పరంగాను .. గ్లామర్ పరంగాను మంచి మార్కులు కొట్టేసింది. దాంతో జాన్వీ కపూర్ ను వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ భారీ చారిత్రక చిత్రంలో నటించే ఛాన్స్ ఆమెకి దక్కింది .. ఆ సినిమా పేరే ‘తక్త్’. ఈ పేరుకి ‘సింహాసనం’ అనే అర్థం వుంది. అందువలన ఇది సింహాసనం కోసం కొనసాగే పోరాట చిత్రంగా ఉంటుందని అనుకోవచ్చు.

500 కోట్ల రూపాయల బడ్జెట్ తో కరణ్ జొహార్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన కరీనా కపూర్ .. అలియా భట్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్ కూడా ఒక హీరో. ఆయన జోడీగా జాన్వీ కపూర్ ను తీసుకుని ఉండొచ్చునని అనుకుంటున్నారు. కెరియర్ ప్రారంభంలోనే ఇంతటి భారీ చిత్రంలో జాన్వీ కపూర్ కి చోటు లభించడం విశేషమేనని చెప్పుకుంటున్నారు.

Related posts

Leave a Comment