హమ్మయ్యా.. కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరికింది!: సీఎంతో సమావేశమైన డీఎస్

పార్టీ వ్యతిరేక ఆరోపణలపై వివరణ
కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా భేటీ
డీఎస్ పై గతంలో ఫిర్యాదు చేసిన కవిత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్(డీఎస్) ఈ రోజు భేటీ అయ్యారు. ఇటీవల నిజామాబాద్ లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అక్కడి నేతలు చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన కేసీఆర్ తో ఆయన ఈ రోజు మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి జరిగిన ఓటింగ్ లో టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి డీఎస్ పాల్గొన్నారు.

కొన్నిరోజుల క్రితం డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలతో కలిసి సీఎంకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. దీంతో ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు డీఎస్ యత్నించగా.. సీఎం అపాయింట్ మెంట్ దొరకలేదు. చివరికి ఢిల్లీలో కేసీఆర్ తో భేటీ అయిన డీఎస్, తనపై టీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. ఈ రోజు జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీలతో కలసి ఎన్డీయే అభ్యర్థికి డీఎస్ ఓటేశారు.

Related posts

Leave a Comment