ద్వారకా తిరుమలకు ఆ పేరు ఎలా వచ్చింది!!

THE NEWS INDIA(tnilivet.v)..ఇద్దరు ధ్రువ మూర్తులను కలిగిన క్షేత్రంగా మనకి ‘ద్వారకా తిరుమల’ కనిపిస్తుంది..సాధారణంగా ఏ క్షేత్రానికి వెళ్లినా అక్కడి గర్భాలయంలో ప్రధానదైవంగా ఒక మూర్తి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా  . వేంకటేశ్వరస్వామి ఇలా దర్శనమివ్వడానికి వెనుక ఆసక్తికరమైన స్థలపురాణం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ద్వారక మహర్షి .. విష్ణుమూర్తి కోసం ఈ ప్రదేశంలో కఠోర తపస్సు చేశాడట. స్వామి ప్రత్యక్షంకాగా .. ఆయన పాదాలను ఎప్పటికీ పూజిస్తూ వుండే భాగ్యమును ఇవ్వమని ద్వారక మహర్షి కోరాడు. అందుకు స్వామి అంగీకరిస్తూ అక్కడ స్వయం వ్యక్తమయ్యారు. ద్వారక మహర్షి కారణంగానే ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చింది.

స్వయం వ్యక్తమైన శ్రీవారి పాదాలు ‘వల్మీకం’లో ఉంటాయి. అందువలన స్వామివారి పూర్తి శిలా రూపాన్ని భక్తులు దర్శించుకోవాలనే ఉద్దేశంతో, ఆ తరువాత కాలంలో స్వయం వ్యక్తమైన స్వామివారి మూర్తికి వెనుక మరో ధృవమూర్తిని ప్రతిష్ఠించారు. స్వయం వ్యక్తమైన స్వామివారి పాదాలను అజమహారాజు .. దశరథ మహారాజు .. శ్రీరామచంద్రుడు దర్శించుకున్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. ప్రత్యేక ఆలయాల్లో అలమేలు మంగతాయారు .. ఆండాళ్ అమ్మవారు పూజలు అందుకుంటూ వుంటారు. శుక్ర .. శనివారాల్లో ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తిరుమల వెళ్లలేని భక్తులు .. చిన్నతిరుపతిగా భావించి ఈ క్షేత్రంలో తమ మొక్కులను చెల్లించుకుంటూ వుంటారు.  

..… రమాదేవి సంగినీడి

Related posts

Leave a Comment