నువ్వు లేనిదే నేను లేను: అనుష్క

అమ్మ తన పక్కనుంటే జీవితంలో ఏదైనా సాధించగలనని అంటున్నారు కథానాయిక అనుష్క. ఈరోజు అనుష్క తల్లి ప్రఫుల్లా శెట్టి పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఇంట్లో వారందరి సమక్షంలో ఆమె కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోను స్వీటీ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

‘నువ్వు లేకుండా నేను లేను. నువ్వు నా పక్కనుంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాను. హ్యాపీ బర్త్‌డే అమ్మా..’ అని అనుష్క పోస్ట్‌ చేశారు. తన తల్లి కోసం ఇంట్లో గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటుచేశారు. ‘హ్యాపీ బర్త్‌డే అమ్మా’ అని డిజైన్‌ చేసున్న కర్టెన్‌కు అందంగా పూలు కూడా అలంకరించారు. అనుష్క ఫొటో పోస్ట్‌ చేసిన కొద్ది సేపటికే నాలుగు వేల మందికి పైగా లైక్‌ చేశారు. అభిమానులు కూడా అనుష్క తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనుష్క చివరిగా ‘భాగమతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత తన తదుపరి సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. పెళ్లి చేసుకోబోతున్నారని అందుకే సినిమాల నుంచి విరామం తీసుకున్నారని వార్తలు వెలువడుతున్నాయి. అనుష్కకు త్వరగా వివాహమవ్వాలని ఆమె తల్లిదండ్రులు బెంగళూరులోని ఓ ఆలయంలో పూజలు కూడా చేసినట్లు గుసగుసలు వినిపించాయి. మరోపక్క ఆమె ఓ చిత్రానికి సంతకం చేసినట్లు ఫిలిం వర్గాలు అంటున్నాయి. వైవిధ్యమైన చిత్రాలు తెరకెక్కించే చంద్రశేఖర్‌ యేలేటి.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సారథ్యంలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. ఇందులో అనుష్క కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మహిళా ప్రాధాన్యమున్న సినిమా అని సమాచారం.

Related posts

Leave a Comment