కౌగిలింతలు, కన్ను కొట్టుళ్లు… ఆహా, ఎంత నాటకం మిస్ అయ్యాను!: కేటీఆర్

  • అవిశ్వాస చర్చను చూడలేదు
  • వాక్చాతుర్యంతో కూడిన పెద్ద నాటకం
  • ట్వీట్ చేసిన కేటీఆర్

తాను చాలా పెద్ద నాటకాన్ని చూడలేకపోయానని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిన్న లోక్ సభలో తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చను ప్రస్తావించిన ఆయన, తాను చర్చను చూడలేదని చెప్పారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెడుతూ “కౌగిలింతలు, కన్ను గీటులు, నేతల వాక్చాతుర్యం తదితరాలతో కూడిన పెద్ద నాటకాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయానే అని అనుకుంటున్నా” అని అన్నారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

Related posts

Leave a Comment