చంద్రబాబు అనుమతిస్తే జగన్ పై నా కూతురు పోటీ చేస్తుంది: ఎమ్మెల్యే జలీల్ ఖాన్

వచ్చే ఎన్నికల్లో కన్నాపై నేను, జగన్ పై నా కూతురు పోటీ చేస్తాం
ఇందుకు చంద్రబాబు అంగీకరించాలని కోరుతున్నా
ఏపీకి జగన్ సైతాన్ లా తయారయ్యాడు
తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తుండే కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత చంద్రబాబు కనుక అనుమతిస్తే వచ్చే ఎన్నికల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై తాను పోటీ చేస్తానని అన్నారు. అలాగే, వైసీపీ అధినేత జగన్ పై తన కుమార్తె పోటీ చేస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పై పోటీ చేసేందుకు తమ కుటుంబసభ్యులు సిద్ధంగా ఉన్నారని, చంద్రబాబు నాయుడు అంగీకరిస్తే తన కూతురుని పోటీకి దింపుతానని అన్నారు. ఈ విషయమై చంద్రబాబు అంగీకరించాలని ఆయన కోరారు. ఏపీకి జగన్ సైతాన్ లా తయారయ్యాడని, తనను తాను రక్షించుకునేందుకే పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు.

Related posts

Leave a Comment