ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ల ప్రేమకు నేనే కారణమన్న హాలీవుడ్ స్టార్ హీరో

ప్రియాంక, నిక్ లు సంతోషంగా ఉన్నారన్న డ్వెయిన్ జాన్సన్
ఇద్దరికీ పరిచయం చేసింది నేనే
ఈ క్రెడిట్ మొత్తం నాదే
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా అమెరికన్ గాయకుడు నిక్ జోనాస్ తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నప్పటకీ… తమ మధ్య ప్రేమాయణం ఉన్నట్టు వీరిద్దరిలో ఎవరూ ప్రకటించలేదు. కానీ, వారు ప్రేమలో ఉన్నారనే విషయాన్ని ప్రముఖ హాలీవుడ్ నటుడు డ్వెయిన్ జాన్సన్ తేల్చి చెప్పాడు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇద్దరి ప్రేమకు తానే కారణమని డ్వెయిన్ జాన్సన్ తెలిపాడు. ఇద్దరూ సంతోషంగా ఉన్నారని… ఈ క్రెడిట్ అంతా తనదే అని చెప్పాడు. ప్రియాంకతో కలసి ‘బేవాచ్’లో, నిక్ తో కలసి ‘జుమాంజీ’ చిత్రాల్లో నటించానని… కామన్ ఫ్రెండ్ గా ఉంటూ ఇద్దరికీ పరిచయం చేయించానని తెలిపాడు.

Related posts

Leave a Comment