పెళ్లి తరువాత నవ వధువులు ఎదుర్కొనే అత్యంత ఇబ్బందికర పరిస్థితులు ఏమిటంటే.. !

టైమ్స్ ఆఫ్ ఇండియా ఆసక్తికర కథనం
అత్తింట కుదురుకునేందుకు నెల రోజుల సమయం
పలు ఇబ్బందులను వెల్లడించిన నవ వధువులు
వివాహమైన తరువాత నవ వధువు అత్తింట అడుగు పెట్టిన వేళ ఎదుర్కొనే అత్యంత ఇబ్బందికర పరిస్థితులపై ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. కొత్తగా పెళ్లయిన యువతులను భాగం చేస్తూ, తొలి నెల రోజుల కాపురంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందుల్లో టాప్-7 ఇవేనంటూ వెల్లడించింది. కొత్త కోడళ్లలో అత్యధికులు, అత్తింట కుదురుకోవడానికి నెల రోజులకు పైగా సమయాన్ని తీసుకుంటారట.

కొత్త బంధువుల ముందు బాత్ రూముకు వెళ్లాలన్నా సిగ్గుపడాల్సిన పనని, చాలా కష్టంగా రోజులు సాగుతాయని చెప్పారట. తొలిసారిగా వంటగదిలోకి వెళ్లిన వేళ కూడా ఇబ్బందిగానే అనిపిస్తుందట. తనకు వివాహమైన తొలిరోజున వంట గదిలోకి వెళ్లి, ఏది ఎక్కడ ఉందో తెలియక ఇబ్బందులు పడ్డట్టు చాలా మంది నవ వధువులు వెల్లడించారు. ఇక పెళ్లయి నాలుగు వారాలైనా, భర్త ముందు దుస్తులు మార్చుకోలేకపోతున్నామని, రాత్రి పూట కలిసున్నా, తెల్లారాక ఆయన ముందు బట్టలు మార్చుకోవాలన్నా, వాష్ రూము నుంచి బయటకు రావాలన్నా సిగ్గుగా అనిపించి ఇబ్బంది పడుతున్నామని చెప్పినవాళ్లూ చాలా మందే ఉన్నారు.

ఇక పెద్దలు కుదిర్చిన వివాహమైతే, తెల్లారితే ఆడపడుచులు, బావమరుదుల ముఖం చూడలేకపోతున్నామని నవ వధువులు వాపోయారు. గది నుంచి బయటకు రాగానే, సూటిగా చూస్తుండే కొత్త బంధువులతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. పెళ్లయిన తరువాత తొలిసారిగా అందరితో కలసి పార్టీకి వెళ్లినప్పుడు ఇబ్బందులు పడ్డామని కొందరు, భర్త లోదుస్తులను ఉతకలేకపోతున్నామని మరికొందరు, తొలిరాత్రి తరువాత బయటున్న వారికి ముఖం చూపించలేక ఇబ్బంది పడ్డామని మరికొందరు వెల్లడించారట.

Related posts

Leave a Comment