ఆ చిరునవ్వే నడిపిస్తోంది: వైఎస్ జగన్

ys jagan paadhayaatra

నేటితో ప్రజాసంకల్ప యాత్రకు 200 రోజులు
మెరుగైన రేపటి కోసం ప్రజల్లో నమ్మకం
రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తా
ట్విట్టర్ లో వైఎస్ జగన్
ప్రజాసంకల్ప యాత్ర… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, వారితో మమేకం అయ్యేందుకు తలపెట్టిన మహా పాదయాత్ర. ప్రజాసంకల్ప యాత్ర మొదలై నేటికి 200 రోజులు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనం అనంతరం, కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకారం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను దాటి ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో సాగుతోంది. ఇక తన యాత్ర మొదలై 200 రోజులైన సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో జగన్ ఓ ట్వీట్ చేశారు. ప్రజలు మెరుగైన రేపటి కోసం వేచిచూస్తున్నారని అన్నారు.

“మెరుగైన రేపటి కోసం నమ్మకం ఉంది. నేను తొలి రోజు నుంచి ప్రజల ముఖాల్లో చూస్తున్నది ఇదే. నా ప్రజాసంకల్ప యాత్ర నేటితో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. రాజన్న రాజ్యాన్ని తిరిగి తెచ్చి, ప్రజల ముఖాల్లో చిరునవ్వులు తెస్తా” అని వ్యాఖ్యానించారు.

Related posts

Leave a Comment