నేడు ఏపీ వ్యాప్తంగా ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ కార్యక్రమం

aadabidda rakshaga kaludham rally latest news

విజయవాడ వేదికగా నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ర్యాలీ
ఈ ర్యాలీలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ
దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచార ఘటన నేపథ్యంలో ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ అంటూ నేడు ఏపీ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విజయవాడ వేదికగా నిర్వహించే రాష్ట్ర స్థాయి ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. మూడు కిలోమీటర్ల వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.

కాగా, మహిళలు, యువతులు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు నిర్వహించాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నేడు అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కనున్నారు. ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. లైంగిక నేరాలకు గురైన వారికి రక్షణ అంశాలపై అవగాహన కల్పించడం, పోక్సో, క్రిమినల్ చట్టాల గురించి ఈ సందర్భంగా తెలియజేయనున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, డ్వాక్రా బృందాలు, సాధికారమిత్రలు, యువజన సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను భాగస్వామ్యం చేయనున్నారు.

Related posts

Leave a Comment