బాబుతో మాకు ఎలాంటి గొడవలు లేవు..అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపీ కుంభంపాటి హరిబాబు రాజీనామా చేసి.. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు సమర్పించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ అమిత్ షా ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసమే హరిబాబు రాజీనామా చేశారని..త్వరలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుదిని ప్రకటిస్తామని తెలిపారు.టీడీపీ అధినేత ,ఏపీ సీఎం నారా చంద్రబాబుతో తమకు ఎలాంటి గొడవలు లేవని..తమ నుంచి ఆయనే వెళ్లిపోయారని చెప్పారు.ఇటీవల చేసిన సర్వేలో రాష్ట్ర కార్యవర్గంలోనూ 80 శాతం మంది టీడీపీ పార్టీతో పొత్తు వద్దని కోరుకున్నారని అన్నారు. కాగా.. ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

Related posts

Leave a Comment