కారు ప్రమాదంలో..నలుగురు మృతి

బళ్లారి తాలూకా సోమసముద్రం సమీపంలో కారు అదుపు తప్పి గోడకు ఢీకొనడంతో నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. కురుగోడు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీదర్‌ జిల్లా భాల్కికి చెందిన డాక్టర్‌ సంతోష్‌ కుటుంబం బీదర్‌ నుంచి బెంగుళూరుకు కారులో వెళ్తుండగా మార్గమధ్యంలో బళ్లారి తాలూకా సోమసముద్రం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న గోడను కారు ఢీకొంది.ప్రమాదం జరిగిన సమయంలో కారును డాక్టర్‌ సంతోష్‌ నడుపుతుండగా, నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, కారులో ఉన్న డాక్టర్‌ సంతోష్‌(35), భార్య డాక్టర్‌ అర్చన(30), తండ్రి సిద్దరామప్ప(58) కూతురు లక్ష్మి(3)లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. డాక్టర్‌ సంతోష్‌ తల్లి లీలావతి(50), కొడుకు తనూష్‌(7)లు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కురుగోడు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.

Related posts

Leave a Comment