పవన్‌ డిమాండ్‌ వల్లే అవిశ్వాసం అంశం:రామకృష్ణ

THE NEWS INDIA(TNI)..ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారని, అందువల్లే తెదేపా, వైకాపా అవిశ్వాస నోటీసులు ఇచ్చాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అయినప్పటికీ, అవిశ్వాసంపై చర్చించేందుకు కేంద్రం ముందుకు రావడంలేదన్నారు. తెదేపా, వైకాపా నేతలు ఒకిరపైఒకరులు దుర్భాషలాడుకుంటున్నారని విమర్శించారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు పక్కనపెట్టేలా తెదేపా, వైకాపాలు వ్యవహరిస్తున్నాయన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన నమ్మక ద్రోహానికి వ్యతిరేకంగా ఈ నెల 6న పాదయాత్రలు చేస్తామని అన్నారు

Related posts

Leave a Comment