అమరావతి… మెగాసిటీ కాదు; ఐవైఆర్‌

THE NEWS INDIA(TNI)… రాజధాని అమరావతి పరిపాలనా కేంద్రంగా ఉండాలే తప్ప… మెగాసిటీగా ఉండరాదని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు అభిప్రాయపడ్డారు. ‘ఎవరి రాజధాని అమరావతి’ పేరుతో తాను రాసిన పుస్తకాన్ని ఈనెల 5న ఆవిష్కరించనున్నట్లు ఆయన విజయవాడలో తెలిపారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్‌‌ సహా వివిధ రాజకీయ పక్షాల నేతలను ఆహ్వానించినట్లు చెప్పారు. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు, అంతర్జాతీయంగా వివిధ దేశాల రాజధానుల తీరుతెన్నుల ఆధారంగా తాను ఈ పుస్తకాన్ని రాసినట్లు వివరించారు. రాజధానిని మార్చాలనేది తన ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు.

Related posts

Leave a Comment