జగన్ పై ఈడీ/సీబీఐ పెట్టిన కేసు కొట్టివేత ..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు వైసీపీ శ్రేణులకు ,ఆ పార్టీ అభిమానులను ఖచ్చితంగా ఇది శుభవార్తే.అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ లకు చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు ,దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైఅక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే.గత కొన్ని ఏండ్లుగా జగన్ పై ఉన్న అక్రమ కేసులపై విచారణ కొనసాగుతూ వస్తుంది.అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం నాంపల్లిలో ప్రత్యేక కోర్టుకు ఆయన హాజరవుతుంటాడు.అయితే తాజాగా ఈడీ అటాచ్ చేసిన జగన్ కు చెందిన జగపతి పబ్లికేషన్ ముప్పై నాలుగు కోట్ల ఆస్తులపై ఉన్న పీఎంఎల్ఏ ను ట్రిబ్యునల్ కొట్టేసింది.ఈడీ దాఖలు చేసిన ఈ చార్జ్ షీట్లో ఎక్కడ కూడా మనీ లాండరింగ్ ,క్విడ్ ప్రోకో కి సరైన ఆధారాలు లేవని ..ఇలాంటి నిరాధారమైన చార్జ్ షీట్లు చెల్లవని తేల్చి చెప్పింది.అంతే కాకుండా ఆరబిందో ఫార్మా ఛార్జ్ షీట్ లో ఈడీ మరియు సీబీఐ ఆరబిందో ఫార్మా వాళ్లకు 21.5కోట్ల లాభం కోసం 29.5కోట్లు జగన్ కంపెనీ లలో పెట్టుబడి పెట్టారని ప్రధాన ఆరోపణ. అయితే జగన్ పై బనాయించిన అక్రమకేసుల్లో ఒక దాని తర్వాత ఒకటి కొట్టేవేయడం వైసీపీ ,జగన్ అభిమానులకు నిజంగా శుభవార్తే కదా ..

Related posts

Leave a Comment