అసెంబ్లీ సమావేశాలకు డ్రోన్‌ కెమెరాలు

మార్చి 5 నుంచి మొదలుకానున్న ఆంధ్రప్రదేశ్ రాష్టృ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు అర్బన్‌ పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. అందులో భాగంగా మొట్టమొదటిసారి సమావేశాల సమయంలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తున్నారు. తాడేపల్లి పరిధిలోని ముఖ్యమంత్రి నివాసం ఉండవల్లి సెంటరు, మంగళగిరి జాతీయ రహదారులపై అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, ర్యాలీలు, రాస్తారోకోల సమాచారం తెలుసుకోవడం కోసం ఈసారి డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తున్నట్లు తెలిసింది. మూడు అంచెల భద్రత చర్యలు ఈసారి తీసుకుంటున్నారు. 

Related posts

Leave a Comment