సిబ్బంది మోసాలతో బ్యాంకులకు రు.2,450 కోట్లు నష్టం

*రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడి*                                                                                                                                      గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న మోసాలలో సిబ్బంది ప్రమేయం కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు రు.2,450 కోట్ల మేర నష్టపోయాయని రిజర్వ్‌ బ్యాంక్‌ అంచనా వేసింది. సిబ్బంది, అధికారుల ప్రమేయంతో జరిగిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు మోసం వెలుగు చూసిన తరువాత రిజర్వ్‌ బ్యాంకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జరిగిన మోసాలపై సమాచారం సేకరించింది. ఈ మోసాలన్నింటిలోని ఆయా బ్యాంకుల సిబ్బంది ప్రమేయం వుందని రిజర్వ్‌ బ్యాంకు ఒక ప్రకటనలో వివరించింది. 2013 ఏప్రిల్‌ నుండి 2016 జూన్‌ మధ్య కాలంలో జరిగిన దాదాపు 1,232 మోసాలలో ప్రభుత్వ బ్యాంకులు మొత్తం రు.2,450 కోట్లు నష్టపోగా రు.లక్ష అంతకు మించిన మోసాలకు సంబందించిన కేసుల్లో సిబ్బంది ప్రమేయం వున్నట్లు తెలుస్తోందని రిజర్వ్‌ బ్యాంక్‌ వివరించింది. ఈ నేరాలన్నింటిలో మహారాష్ట్రతో సహా దక్షిణాది రాష్ట్రాల్లోనే అధికశాతం నమోదయ్యాయని వివరించింది. 

Related posts

Leave a Comment