‘శ్రీదేవిని హత్య చేశారు’

 ప్రముఖ నటి శ్రీదేవి ఆకస్మిక మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో బీజేపీ సీనియర్‌ నేత, ప్రముఖ న్యాయవాది కూడా అయిన సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదంటూ.. దుబాయ్‌ ఫోరెన్సిక్‌ రిపోర్టులో వెల్లడైన అంశాలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డాక్టర్లు అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చి గుండెపోటుతో చనిపోయారని ప్రకటించారని.. ఈ నేపథ్యంలో ఆమెతో బలవంతంగా మద్యం సేవించారా అనేది తేలాలన్నారు. శ్రీదేవిని హత్య చేశారనే అనుమానం తనకు కలుగుతోందంటూ  పెను సంచలనానికి తెర తీసారు. ఈ మొత్తం వ్యవహారంలో సీసీ టీవీ ఫుటేజి ఏమైందని ఆయన ప్రశ్నించారు. గుండెపోటుతో చనిపోయారని ప్రకటించడం ముందస్తు వ్యూహంలో భాగంగానే జరిగిందని భావిస్తున్నానన్నారు.  అంతేకాదు సినీతారలకు దావూద్‌కు సంబంధాలున్నాయనీ.. ఈవైపుగా దృష్టి కేంద్రీకరించాలంటూ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే మీడియాలో వస్తున్న విషయాలు వాస్తవాలు స్థిరంగా ఉండవన్నారు.  అసలు ఏం జరిగిందనేది పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ ప్రకటించే దాకా వేచి వుండాలని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు.

Related posts

Leave a Comment