భార్యపై కోపంతో కూతుర్ని చంపిన ఉన్మాది..

ఆస్తి తగాదాల కారణంగా భార్య మీద కోపంతో కన్నకూతురిని కడతేర్చాడు ఆ కసాయి తండ్రి. అంతటితో ఆగకుండా తన సంతానమైన మరో ఇద్దరు పిల్లల్ని సైతo చంపేందుకు విఫలయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో చోటుచేసుకుంది. మెయిన్‌పురి జిల్లా, తహర్‌పూర్‌ గ్రామానికి చెందిన 50 ఏళ్ల షేర్‌ సింగ్ మద్యానికి బానిసై కుటుంబ కలహాలతో సతమతమయ్యేవాడు. ఇటీవలే అతని‌ భార్య.. వారికున్న ఎకరా భూమిని ఆమె పేరుతో రిజిస్ర్టేషన్‌ చేయించుకుంది. ఆ భూమిని అమ్మేందుకు వీలులేకుండా తన పేరు మీదకు మార్చుకున్న భార్యపై షేర్‌సింగ్‌ కోపం పెంచుకున్నాడు.‘షేర్‌సింగ్‌ ముగ్గురు పిల్లల్ని ఇంట్లో నిర్బంధించాడు. తొలుత ఐదేళ్ల తన కొడుకు వివేక్‌ను చంపడానికి ప్రయత్నించాడు. కానీ ఆ సమయంలో అతని ఇద్దరు కూతుళ్లు ఏడ్వటం ప్రారంభించారు. దీంతో పదేళ్ల తన పెద్దకూతురు ముస్కాన్‌ను దగ్గరికి తీసుకుని గొంతు నులిమి చంపేశాడు. ఈ క్రమంలో మిగిలిన ఇద్దరు చిన్నారులు అక్కణ్నుంచి తప్పించుకుని పారిపోయారు’ అని స్థానికి పోలీస్‌స్టేషన్‌కు చెందిన‌ ఎస్పీ ఎస్‌.రాజేశ్‌ వివరించారు. ముస్కాన్‌ను చంపాక మానసికంగా కుంగిపోయిన షేర్‌ సింగ్‌ ‌ ఉరి వేసుకుని చనిపోయేందుకు సిద్ధమయ్యాడు. కానీ సమయానికి వచ్చిన అతని సోదరులు ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకున్నారు. కూతురిని చంపడమే కాకుండా.. ఇద్దరు పిల్లలపై హత్యాయత్నానికి పాల్పడిన షేర్‌సింగ్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Related posts

Leave a Comment