కారు ఢీకొన్నా ఆగని కేంద్రమంత్రి…..

THE NEWS INDIA(TNI)…( బెంగళూరు ) దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని సావకనహళ్లి గేట్‌ వద్ద ఆదివారం సాయంత్రం సంభవించిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. కారు, ద్విచక్ర వాహనం ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్డే కారణమని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. విమానాశ్రయానికి అనంతకుమార్‌ హెగ్డే కారులో వెళుతున్న సమయంలో, ఒక హంప్‌ వద్ద కారు డ్రైవరు ఒక్కసారిగా బ్రేకులు వేశారు. అదే కారును వేగంగా అనుసరించుకుంటూ వస్తున్న కారు ఒక్కసారిగా అనంతకుమార్‌ హెగ్డే కారును ఢీకొంది. ఆ కారు వెనుక వస్తున్న మరో ద్విచక్ర వాహనం ముందు వెళుతున్న కారును ఢీకొంది. కారులో ఉన్న ముగ్గురు, ద్విచక్ర వాహనంలో ఉన్న యువకుడు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రమాదం జరిగినా, అనంతకుమార్‌ హెగ్డే తన కారును ఆపకుండా ముందుకు వెళ్లారని బాధితులు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు విశ్వనాథపుర ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related posts

Leave a Comment