క్రేజీ గ్యాంగ్‌తో చాలా ఎంజాయ్‌ చేశా

ముంబయి: బాలీవుడ్‌ నటులు ఆదిత్యరాయ్‌ కపూర్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా రూపుదిద్దుకుంటున్న ‘ఓకే జాను’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ వేడుకను యూనిట్‌ సభ్యులు మొత్తం కలిసి సరదాగా చేసుకున్నట్లు శ్రద్ధాకపూర్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. షూటింగ్‌ పూర్తయిందని, ఈ క్రేజీ గ్యాంగ్‌తో చాలా ఎంజాయ్‌ చేశానని పేర్కొన్నారు. షూటింగ్‌ పూర్తి కావడంతో… చాలా మిస్‌ అవుతున్నానని ట్వీట్‌ చేశారు. ‘ఓకే జాను’ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ… సినిమా స్టిల్‌ను పోస్ట్‌ చేశారు. మణిశర్మ దర్శకత్వంలో మలయాళంలో విడుదలై విజయం సాధించిన ‘ఓకే కణ్మని’ చిత్రానికి రీమేక్‌గా ‘ఓకే జాను’ని తెరకెక్కిస్తున్నారు. కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

Related posts

Leave a Comment