ఆక్సిజన్‌ లేకపోవడంతో ఇందులోని సిబ్బంది చనిపోయారూ…

లండన్‌: రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అదృశ్యమైన సబ్‌మెరైన్‌ 73ఏళ్ల తర్వాత బయటపడింది. బ్రిటన్‌కు చెందిన ఈ 1,290 టన్నుల జలాంతర్గామిని సర్దీనియా తీరాన మధ్యధరాసముద్రంలో కనుగొన్నారు. 100 మీటర్ల లోతులో ఓ డైవింగ్‌ బృందం ఈ సబ్‌మెరైన్‌ను గుర్తించి అధికారులకు సమాచారమందించారు. ఇందులో 71 మంది అవశేషాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.1942, డిసెంబర్‌ 28న ఇటలీ యుద్ధ విమానాలను ధ్వంసం చేసేందుకు ఈ సబ్‌మెరైన్‌ మాల్టా ప్రాంతం నుంచి బయలుదేరింది. చివరిసారిగా డిసెంబర్‌ 31న ఈ జలాంతర్గామి నుంచి సిగ్నల్స్‌ వచ్చాయి. అనంతరం 1943 జనవరి 2న ఈ సబ్‌మెరైన్‌ కన్పించకుండా పోయింది. సముద్రంలో మునిగిపోయి ఉంటుందని అప్పటి అధికారులు భావించారు.ఇన్నేళ్ల తర్వాత మధ్యధరా సముద్రంలో దీన్ని గుర్తించారు. చిన్న డ్యామేజ్‌ మినహా.. ఈ సబ్‌మెరైన్‌ ఇప్పటికీ పూర్తి కండిషన్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. ఆక్సిజన్‌ లేకపోవడంతో ఇందులోని సిబ్బంది చనిపోయారని తెలిపారు.

Related posts

Leave a Comment