హైకోర్టు వారు ప్రధానమైన అంశాన్ని ప్రస్తావించారు: ఐవైఆర్ కృష్ణారావు

The High Court referred to the main point IYR Krishna Rao

మత సంబంధ అంశాల్లో సర్కారు జోక్యం చేసుకోవడం ఎందుకంటూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుబట్టిందంటూ ఈనాడులో ప్రచురించిన ఓ వార్తను పోస్ట్ చేస్తూ ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దీనిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘హైకోర్టు వారు ప్రధానమైన అంశాన్ని ప్రస్తావించారు. ఏ ఇతర మత వ్యవహారాలలో లేని విధంగా హిందూ మత అంశాలలో జోక్యం చేసుకుని ప్రభుత్వాలు వ్యవస్థలను, ఆలయాలను నిర్వీర్యం చేస్తున్నాయి. హైకోర్టు ముందే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి (బీజేపీ నేత) గారి ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని త్వరగా పరిష్కరిస్తే ప్రశ్నకు సమాధానం రావచ్చు’ అని ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. Tags: IYR Krishna Rao, YSRCP, swaroopananda

Read More

బీజేపీలో చేరాలని అళగిరికి ఆహ్వానం… సమస్యే లేదని వెల్లడి!

ఆరేళ్ల క్రితం డీఎంకే నుంచి డిస్మిస్ అయి, ఆపై రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన కరుణానిధి కుమారుడు ఆళగిరి, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఆయన బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తే మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ వ్యాఖ్యానించారు. కొత్త రాజకీయ పార్టీపై అళగిరి ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ రాజకీయ పార్టీని ప్రారంభించకుంటే మాత్రం బీజేపీకి ఆహ్వానిస్తామని ఆయన అన్నారు. ఇక ఈ వార్తలపై స్పందించిన అళగిరి, తాను బీజేపీలో చేరే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. మధురైలో మీడియాతో మాట్లాడిన ఆయన, మురుగన్ తన సొంత అభిప్రాయాన్ని చెప్పి వుండవచ్చని అన్నారు. ఈ నెల 20న మద్దతుదారులతో జరపాల్సిన సమావేశాన్ని తాను వాయిదా వేశానని అన్నారు. తన రాజకీయ…

Read More

ఏపీకి మరో ఆర్థికభారం తప్పదా …?

 THE NEWS INDIA NATIONAL NEWS NETWORK…ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతవుతున్న ఏపీపై ఇప్పుడు మరో అదనపు భారం పడుతోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకయ్యే ఖర్చు తడిపి మోపిడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాల పునర్విభజన, ఆఫీసుల ఏర్పాటు, ఆస్తుల పంపిణీ, ఇతర మౌలిక వనరుల కల్పనకు భారీగా వ్యయమయ్యే అవకాశం ఉండడంతో ఆయా అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఏడాది జనవరి నాటి అంచనాల ప్రకారం సుమారు 1,300 కోట్ల రూపాయల వ్యయమవుతుందని ప్రాథమిక పరిశీలనలో తేలినట్లు సమాచారం.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనకు సీఎస్‌ నేతృత్వంలో…

Read More