హరీశ్ రావు వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తున్నాయి: విజయశాంతి

దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదన్న మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తున్నాయని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సందేహం వ్యక్తం చేశారు. దీన్నిబట్టి ఎన్నికలకు ముందే ఫలితాలెలా ఉండాలో టీఆర్ఎస్ నిర్ణయించిందనే విషయం అర్థమవుతోందని చెప్పారు. అధికార పార్టీ అరాచకాలపై దుబ్బాక ఓటర్లకు స్పష్టత వచ్చిందని అన్నారు. హరీశ్ ‌రావు కామెంట్ చూస్తుంటే… దుబ్బాక పోలింగ్ తర్వాత కేసీఆర్ ఫాంహౌస్‌లో ఈవీఎంలు పెట్టి ఓట్లు లెక్కిస్తారేమోనన్న అనుమానం వస్తోందని చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యే మరణంతో జరిగే ఉపఎన్నిక గురించి టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా హరీశ్ రావు హైరానా ఎందుకో ఎవరికీ అంతు చిక్కడంలేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉపఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే… దాని ప్రభావం హరీశ్ మంత్రి పదవి మీద పడుతుందని కేసీఆర్ ఏదన్నా…

Read More

లగ్జరీ కార్ల తయారీదారు లాంబోర్ఘినీ ఏపీలో అడుగుపెడుతోంది: విజయసాయిరెడ్డి

ఇటలీకి చెందిన విలాసవంతమైన స్పోర్ట్స్ కార్ల తయారీదారు లాంబోర్ఘినీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఏపీలో మరో మెగా పెట్టుబడి అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఏపీలో విద్యుత్ ఆధారిత వాహనాలు తయారుచేసేందుకు లాంబోర్ఘినీ ఆసక్తి చూపుతోందని, రూ.1,750 కోట్ల మేర పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉందని వివరించారు. భారత్ లో పెట్టుబడులకు అత్యంత అనువైన రాష్ట్రంగా ఏపీ పేరు తెచ్చుకుంటోందని, సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు పోతోందని కొనియాడారు. లాంబోర్ఘినీ ఓ ప్రపంచస్థాయి కార్ల తయారీ దిగ్గజం. ఈ సంస్థ తయారుచేసిన పలు మోడళ్లు రూ.3 కోట్ల పైచిలుకు ధర పలుకుతున్నాయి. భారత్ లోనూ అనేకమంది సినీ స్టార్లు లాంబోర్ఘినీ కారు కొనడాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారంటే అతిశయోక్తి కాదు.

Read More

సెకెండ్‌వేవ్ కరోనా మరింత డేంజర్.. వైద్యవర్గాల వార్నింగ్

న్యూస్ ఇండియా నేషనల్ న్యూస్ నెట్వర్క్….గత వారం, పది రోజులుగా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్న కరోనా వైరస్ భవిష్యత్తులో మరోసారి విజృంభించ వచ్చంటున్నారు నిఫుణులు. దీనినే సెకెండ్ వేవ్‌గా పిలుస్తుండగా.. దాని ప్రభావం త్వరలోనే దేశంలో కనిపిస్తుందని అంఛనా వేస్తున్నారు. పదిహేను రోజుల క్రితం దేశంలో రోజూవారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 వేలల్లో నమోదయ్యేది.. అది క్రమంగా తగ్గుతూ వస్తూ.. ప్రస్తుతం 40 వేలలో కేసులు ప్రతీ రోజు నమోదవుతున్నాయి. మరణాల రేటు తగ్గుతోంది. పాజిటివ్ కేసుల శాతం తగ్గుతోంది. ఈ నెంబర్లను ఫాలో అవుతున్న వారిలో క్రమేపీ కరోనా పట్ల నిర్లక్ష్యం ఆవహిస్తోంది. ఫలితంగా మాస్కులు లేని మనుషుల సంచారం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ టెండెన్సీ ప్రమాదమంటున్నారు నిఫుణులు. దేశంలో సెకెండ్ వేవ్ కరోనా వైరస్ మరో 3, 4 వారాల్లో ప్రారంభమవుతుందని…

Read More