బాలీవుడ్ అనే పదం ఒక కాపీ.. దాన్ని తిరస్కరించండి: కంగన రనౌత్

ఇండియాలో చిత్ర పరిశ్రమ ఉంది బాలీవుడ్ అనే హాస్యాస్పదమైన పదం హాలీవుడ్ నుంచి వచ్చింది ఆ అవమానకరమైన పదాన్ని తిరస్కరించండి బాలీవుడ్ లో నెలకొన్న డ్రగ్స్ సంస్కృతి, నెపోటిజం తదితర అంశాలపై పోరాడుతున్న హీరోయిన్ కంగన రనౌత్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మన దేశంలో కళాకారులున్నారు, బఫూన్లు ఉన్నారు, భారత చిత్ర పరిశ్రమ ఉంది, బాలీవుడ్ కూడా ఉంది. బాలీవుడ్ అనే హాస్యాస్పదమైన పదాన్ని హాలీవుడ్ నుంచి కాపీ చేశారు. అక్కడి నుంచి దొంగిలించారు. ఈ అవమానకరమైన పదాన్ని దయచేసి తిరస్కరించండి’ అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె ‘తలైవి’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాను దివంగత జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. There are ARTISTS and there are BHANDS there is INDIAN FILM INDUSTRY and there is BOLLYWOOD…

Read More

ఇంద్రకీలాద్రికి మణిహారం… కనకదుర్గ వంతెనను ప్రారంభించనున్న గడ్కరీ, జగన్!

Maniharam to Indrakeeladri ... Gadkari to open Kanakadurga bridge, Jagan!

పై వంతెన నేడు జాతికి అంకితం మరో 61 ప్రాజెక్టుల శంకుస్థాపన కూడా 10 ప్రాజెక్టులు జాతికి అంకితం కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రికి కంఠహారంగా రూపుదిద్దుకున్న ఫ్లై ఓవర్ నేడు జాతికి అంకితం కానుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో రూ. 15,591 కోట్లకు పైగా విలువైన పలు పనులకు శంకుస్థాపన జరుగనుంది. న్యూఢిల్లీ నుంచి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ కనకదుర్గ పై వంతెన ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరో 61 ప్రాజెక్టుల శంకుస్థాపనలతో పాటు, పూర్తయిన 10 ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. కాగా, విజయవాడలో ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి, ఈ వంతెన ప్రారంభం కావడం తప్పనిసరైన పరిస్థితుల్లో, తక్షణమే దీన్ని ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలుమార్లు వంతెన…

Read More