వైసీపీలోకి గంటా చేరికపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

వైసీపీలోకి రావాలనుకుంటే పదవికి రాజీనామా చేయాలి ఇది వైసీపీ సిద్ధాంతం పార్టీ ఆశయాలకు అనుగుణంగా జగన్ నిర్ణయం తీసుకుంటారు టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ గూటికి చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలంటూ విజయసాయి అన్నారు. వ్యక్తుల కోసం తమ పార్టీ సిద్ధాంతాలను మార్చలేమని అన్నారు. వైసీపీలోకి ఎవరైనా రావాలనుకుంటే ముందుగా రాజీనామా చేయాలనేది పార్టీ సిద్ధాంతమని విజయసాయి చెప్పారు. జగన్ సుపరిపాలనను చూసి వైసీపీలో చేరేందుకు పలువురు ఎమ్మెల్యేలు సుముఖంగా ఉన్నారని అన్నారు. అయితే పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. విజయసాయి వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారాయి. గంటా చేరికను విజయసాయి తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. Tags: Vijayasai Reddy, Jagan YSRCP, Ganta Srinivasa Rao, Telugudesam

వైసీపీలోకి రావాలనుకుంటే పదవికి రాజీనామా చేయాలి ఇది వైసీపీ సిద్ధాంతం పార్టీ ఆశయాలకు అనుగుణంగా జగన్ నిర్ణయం తీసుకుంటారు టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ గూటికి చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలంటూ విజయసాయి అన్నారు. వ్యక్తుల కోసం తమ పార్టీ సిద్ధాంతాలను మార్చలేమని అన్నారు. వైసీపీలోకి ఎవరైనా రావాలనుకుంటే ముందుగా రాజీనామా చేయాలనేది పార్టీ సిద్ధాంతమని విజయసాయి చెప్పారు. జగన్ సుపరిపాలనను చూసి వైసీపీలో చేరేందుకు పలువురు ఎమ్మెల్యేలు సుముఖంగా ఉన్నారని అన్నారు. అయితే పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. విజయసాయి వ్యాఖ్యలు…

Read More

వివాదాస్పదమవుతున్న సంచైత నిర్ణయం

మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ సంచైతా గజపతిరాజు తాజా నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ట్రస్టు ఆధ్వరంలో గడచిన 150 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుస్తున్న ఎంఆర్ ఎయిడెడ్ కాలేజిని అన్ ఎయిడెడ్ కాలేజీగా మార్చాలంటూ ట్రస్టు నుండి ప్రభుత్వానికి అభ్యర్ధన అందటమే వివాదానికి కారణమైంది. విజయనగరం రాజులు స్వయంగా నిర్మించి నిర్వహించిన ఈ కాలేజికి మంచిపేరుంది. దీని నిర్వహణంతా ట్రస్టే చూసుకుంటున్నా సిబ్బంది జీతబత్యాలు మాత్రమే ప్రభుత్వమే చూసుకుంటోంది. అంటే సుమారు 150 మంది సిబ్బంది జీతబత్యాల భారం ట్రస్టుపై లేదన్న విషయం అందరికీ అర్ధమవుతోంది. మామూలుగా ఎవరైనా అన్ ఎయిడెడ్ కాలేజీని ఎయిడెడ్ కాలేజీగా మార్చటానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఒకాసరి ఎయిడెడ్ కాలేజీగా గుర్తిస్తే కాలేజీ నిర్వహణ భారం చాలావరకు తగ్గిపోతుంది. ఎంఆర్ కాలేజీని 1857లో ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 4 వేలమంది విద్యార్ధులు చదువుకుంటున్నారు.…

Read More

పోలిట్ బ్యూరోకి గల్లా రాజీనామా..

Galla resigns from politburo

సీనియర్ నేత, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి టిడిపి పొలిటో బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. మధ్యాహ్నం రాజీనామా చేసిన గల్లా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆమె చాలా కాలంగా చంద్రబాబునాయుడు వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆమె అటు చంద్రగిరిలో పార్టీ కార్యక్రమాలకు హాజరుకావటం లేదు. ఇటు చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. ఏదో రూపంలో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న గల్లా చివరకు పొలిట్ బ్యూరో సభ్యత్వానికి కూడా రాజీనామా చేయటం సంచలనంగా మారింది. గల్లా అరుణకుమారి అంటే కేవలం పొలిట్ బ్యూరో సభ్యురాలు మాత్రమే కాదు. గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కు తల్లి కూడా. అటువంటి ఆమె పార్టీలో అత్యున్నత నిర్ణాయక వేదికైన పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసిందంటే…

Read More