జనాభా లెక్కలకు అడ్డు చెప్పడమా? ఇదేంటి?

అనుభవ రాహిత్యమో, అవగాహనా రాహిత్యమో తెలియదు కానీ నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్ పి ఆర్) ను ప్రస్తుత పద్ధతిలో అమలు చేయరాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానించింది. ఎన్ పి ఆర్ అనేది జనాభా లెక్కలు మాత్రమే అనే విషయాన్ని మర్చిపోయి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పలువురిని ఆశ్చర్య పరుస్తున్నది. ఎన్ పి ఆర్ లో సాధారణ విషయాలు తప్ప మతానికి సంబంధించిన అంశాలు ఉండవు. పైగా ఎలాంటి ధృవపత్రాలు అడగరు. ఎన్ పి ఆర్ తో ఒక వ్యక్తి మతాన్ని నిర్ధారించే అవకాశం లేదు. ఇది ఎన్నో దశాబ్దాలుగా జరుగుతున్న జనాభా లెక్కల ప్రక్రియ మాత్రమే. అలాంటి ఎన్ పి ఆర్ ను 2010 ప్రశ్నావళి ప్రకారం మాత్రమే చేపట్టాలని లేకపోతే తాము తిరస్కరిస్తామని మంత్రివర్గం తీర్మానించడం రాజ్యాంగ విరుద్ధం…

Read More

రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ ; విద్యాశాఖ కీలక నిర్ణయం

తెలంగాణ లో కరోనా(కోవిడ్‌-19) పాజిటివ్‌ కేసు నమోదయిన నేపథ్యంలో వైరస్‌ విస్తరించకుండా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభ మయ్యాయి. విద్యార్ధుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని ఇంటర్‌ విద్యార్థులు మాస్క్‌లు ధరించి పరీక్షలు రాయడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అనుమతినిచ్చింది. కరోనా వైరస్‌ వ్యాపించకుండా పరీక్ష కేంద్రాలను శుభ్రంగా ఉంచాలని సూపరింటెండెంట్లను ఆదేశించింది. విద్యార్థులు వాటర్ బాటిల్స్ తెచ్చుకోవడానికి అనుమతిచ్చింది. కాగా దగ్గు, జలుబుతో బాధపడే విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నారు. జలుబుతో బాధపడే ఇన్విజిలేటర్లకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్ణయించింది. కాగా….. మైండ్‌ స్పేస్‌లోని మహిళా ఉద్యోగికి కరోనా వైరస్‌ లేదని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఆ టెకీకి కరోనా వైరస్‌ లక్షణాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. ఐటీ కారిడర్‌…

Read More

ఉగాది రోజుల ఇళ్ల స్థలాల పంపిణీ లేనట్లేనా….?

ఉగాది రోజున పాతిక లక్షల మందికి ఇళ్ల స్థలాలను . ఒక్కొక్క కుటుంబానికి ఒక్కో సెంటు చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈ పథకంపై ఫాలో అప్ చేస్తున్నారు. భూములు అందుబాటులో లేకపోతే. ప్రత్యేకంగా సేకరిస్తున్నారు. అయితే.. ఇంత చేసినా.. ఉగాది రోజున ఇళ్ల పట్టాల పంపిణీ సాధ్యం కాదా.. అనే చర్చ.. అధికారవర్గాల్లో ప్రారంభమయింది. దీనికి కారణం స్థలాలు రెడీ కాకపోవడం కాదు.. ఎన్నికల కోడ్ వర్తించే అవకాశం ఉండటం. ప్రస్తుతం నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉగాది ఈ నెల ఇరవై ఐదో తేదీ. ఈ రెండు లక్ష్యాలకు పొంతన కుదరడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే.. ఒకటి కాదు.. మూడు రకాల ఎన్నికలు…

Read More

నిర్భయ దోషి క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బుధవారం తిరస్కరించారు. ఇప్పటికే నిర్భయ దోషులు వినయ్, ముఖేష్, అక్షయ్ లు పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించిన విషయం తెలిసిందే. మార్చి 3న నలుగురు దోషులను తీహార్ జైలులో ఉరి తీయనుండగా.. తన క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నందున ఉరిని నిలిపివేయాలని దోషి పవన్ గుప్తా కోరుతూ ఢిల్లీ కోర్టులో క్యూరేటీవ్ పిటిషన్ వేశాడు. దీంతో మార్చి 2న దీనిపై విచారించిన ఢిల్లీ కోర్టు ఉరిపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నలుగురు దోషుల ఉరిని నిలిపివేయాలని తీహార్ జైలు అధికారులకు ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీంతో నిర్భయ దోషుల ఉరి మూడోసారి వాయిదా పడింది.

Read More