షుగర్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త..!

అవును షుగర్ వ్యాధి ఉన్నవారికి ఇది నిజంగా శుభవార్తే.. ఎందుకంటే.. షుగర్ వ్యాధి తగ్గించుకునేందుకు ఓ మార్గం గురించి ఓ పరిశోధన ఆసక్తికరమైన వార్త తెలిపింది. అదేంటంటే.. టైప్-2 డయాబెటిస్ వ్యాధి నిర్ధరణ తర్వాత తొలి ఐదేళ్లలో 10శాతం శరీర బరువు తగ్గితే వ్యాధి పూర్తిగా నయమయ్యే అవకాశాలున్నాయట. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ విషయం కనిపెట్టారు. 40 నుంచి 69 ఏళ్ల వయస్సు ఉన్నవారిపై వీరు పరిశోధన చేశారు. కొత్తగా డయాబెటిస్ బారిన పడ్డ 867 మందిపై పరిశోధన సాగించారు. వారిలో తొలి ఐదేళ్లలో శరీర బరువును 10 శాతం తగ్గించుకున్న 257 మందికి వ్యాధి పూర్తిగా నయమైనట్టు గుర్తించారు. జీవనశైలి మార్పులు, సరైన వైద్యంతో.. టైప్-2 డయాబెటిస్ బారి నుంచి బయటపడొచ్చని జర్నల్ డయాబెటిక్ మెడిసిన్ లో ప్రచురితమైన నివేదిక తెలిపింది. ఎనిమిది వారాలు…

Read More

శరన్నవరాత్రి ఉత్సవాలు : పంచహారతుల విశిష్టత

  న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్ ….అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపూటమ్మ దుర్గమ్మను కొలవని భక్తులు ఉండరు. దసరా శరన్నవరాత్రి వేడుకల్లో వివిధ అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమిస్తుంది. అటువంటి అమ్మవారికి ఇచ్చే హారతి ఎంతో ముఖ్యమైనది. ఒకదాని తర్వాత మరొకటి వచ్చే పంచ హారతులను చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. ప్రధానంగా సాధారణ రోజుల్లో హారతులను చూడాలంటే విజయవాడ దుర్గగుడి అధికారులు భక్తుల నుంచి రెండు వందల రూపాయలు వసూలు చేస్తుంటారు. కానీ దసరా ఉత్సవాల్లో మాత్రం భక్తులను టిక్కెట్ లేకుండా అనుమతిస్తూ.. ఆ అపురూప హారతిని దర్శించుకునే వీలు కల్పిస్తున్నారు ఆలయ అధికారులు. సాయం సంధ్యవేళ నివేదన అనంతరం దుర్గమ్మకు పంచ హారతులు ఇస్తుంటారు. అందులో మొదటగా ఇచ్చేది ఓంకార హారతి. సృష్టికి మూలమైన ఓంకార నాదాన్ని వినడం.. ఓంకార రూపాన్ని చూడడం వల్ల పాపాలు…

Read More

మోడీ ప్రసంగం ప్రసారం చేయలేదని..డీడీ అసిస్టెంట్ డైరక్టర్ సస్పెండ్

 THE NEWS INDIA 24/7 NATIONAL NEWS NETWORK…సెప్టెంబర్‌ 30,2019న మద్రాస్ ఐఐటీ స్నాతకోత్సవం కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొని ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోడీ ఐఐటీ మద్రాస్‌లో చేసిన ప్రసంగం ప్రసారాన్ని నిలిపివేసినందుకు చెన్నై దూరదర్శన్‌ కేంద్రం డీడీ పొదిగై టీవీ అధికారిపై ప్రసార భారతి వేటు వేసింది. ఉద్దేశ్యపూర్వకరంగానే ప్రధాని ప్రసంగం ప్రసారాన్ని డీడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆర్‌ వసుమతి అడ్డుకున్నారనే అభియోగాలపై ఆమెను ప్రసారభారతి సస్పెండ్‌ చేసింది. ఈ కార్యక్రమానికి ముందు ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాల్సి ఉందా అని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసుమతి తన ఉన్నతాధికారులకు ఈమెయిల్‌ చేయగా ప్రధాని ప్రసంగాన్ని లైవ్‌ ఇవ్వాలని వారు బదులిచ్చినట్టు ప్రసార భారతి వర్గాలు తెలిపాయి. స్పష్టమైన ఉత్తర్వులున్నా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసుమతి ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయరాదని…

Read More

అంగన్ వాడీలకు ….దసరా గిఫ్ట్

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్ ….  అంగన్ వాడీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. దసరా పండగ సందర్భంగా అంగన్ వాడీ ఉద్యోగులకు ముందే వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 83 కోట్లు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతి నెల మాసాంతంలో వేతనాలు అందుతున్నాయి. అయితే అకోబ్టర్ లో దసరా పండగ మొదటి వారంలోనే రావడంతో వేతనాలు లేకపోవడం వల్ల పండగకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని తెలంగాణ అంగన్ వాడీ సంఘం నేతలు మంగళవారం(అక్టోబర్ 1, 2019) మంత్రి సత్యవతి రాథోడ్ ను కలిసి వేతనాలు ఇప్పించాలని కోరారు. అంగన్ వాడీల విజ్ణప్తిని మంత్రి సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. వెంటనే స్పందించిన సిఎం ఉద్యోగులకు వేతనాల కోసం నిధులు…

Read More