శాంతిస్తున్న …గోదారమ్మ

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…..  ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు  ఉగ్రరూపం దాల్చి ఊళ్లను ముంచెత్తిన వరద గోదావరి తగ్గుముఖం పట్టింది. మూడు రోజులుగా ఉధృతంగా ప్రవహించి దేవీపట్నం, విలీన మండలాల్లోని దాదాపు 56 గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. మూడు నదీపాయలతో 50కి పైగా లంక గ్రామాలతో ఉన్న కోనసీమ వరద ఉధృతికి గత మూడు రోజులుగా అతలాకుతలమవుతోంది. మంగళవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద నీటిమట్టం మూడు అడుగుల మేర తగ్గడంతో జిల్లా ఏజెన్సీ ప్రజలు వరదల భయం నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. కోనసీమ దిగువన అంటే సముద్ర తీరంలో ఉండడంతో ఎగువన వరద నీరంతా చివరకు ఈ సీమ నుంచే సముద్రంలో కలిసే పరిస్థితి ఉండడంతో ఈ ప్రాంతంలోని 48 లంక గ్రామాలు వరద ఉధృతితో మంగళవారం రాత్రి వరకూ చిగురుటాకుల్లా…

Read More

ఆత్మకూరుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్న… వైసీపీ!!

 న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…( అమరావతి) చలో ఆత్మకూరు యాత్ర చేపట్టేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఉదయం 10 గంటలకు వైసీపీ కార్యాలయం నుంచి ఆత్మకూరుకు ర్యాలీగా వెళ్లేందుకు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. వైసీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా చలో ఆత్మకూరు కార్యక్రమాలను చేపడుతుండడంతో ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది.

Read More

నీ దృష్టిలో నిరుపేదలు వీరేనా…. చంద్రబాబు ను ఉతికారేసిన “విజయసాయిరెడ్డి”

  న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో పల్నాడులో ఐదేళ్లు రౌడీ రాజ్యమేలిందని ఆయన అన్నారు. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయనే రచ్చ చేయడం ద్వారా… రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకుండా దొంగల ముఠా కుట్రలు మొదలుపెట్టిందని మండిపడ్డారు. యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే చంద్రబాబు ఈ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. పల్నాడులో ప్రశాంతత నెలకొనడం చంద్రబాబుకు ఇష్టం లేదనే విషయం అర్థమవుతోందని చెప్పారు. పేదల జోలికి వస్తే ఊరుకోనని చంద్రబాబు చెబుతున్నారని… ఆయన దృష్టిలో కోడెల శివప్రసాద్, యరపతినేని, చింతమనేని ప్రభాకర్, నారాయణ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, సుజనా చౌదరిలే నిరుపేదలని ఎద్దేవా చేశారు.

Read More

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో… ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ ఒప్పందం!

 న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…. ఈ నెల 30 నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. తిరుపతి రీజనల్ మేనేజర్ కార్యాలయంలో జరిగిన చర్చల తరువాత, భక్తులకు ఎటువంటి ప్రయాణ అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక బస్సులు నడిపేందుకు డీల్ కుదిరింది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు మార్చుకున్నారు. కాగా, బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 8 వరకూ జరగనున్న సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య 150 ప్రత్యేక బస్సులు నడపాలని అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక ఈ బస్సులను ఏఏ రూట్లలో నడపాలన్న విషయాలపైనా అధికారులు చర్చించారు. ఇక, 18 నుంచి వచ్చే నెల 17వ వరకు పెరటాశి మాసం కావడంతో, తమిళనాడులోని వివిధ ప్రాంతాల…

Read More