15న రాష్ట్రానికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ రాక

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…— (అమరావతి బ్యూరో) అటవీహక్కుల చట్టంపై సమీక్ష ,….   ఈ నెల 15న కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ (మోటా) డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ అనిల్‌ కుమార్‌ రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అటవీ హక్కు చట్టం అమలవుతున్న తీరుపై ఆయన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అటవీ హక్కు చట్టం ప్రకారం ఇప్పటి వరకు భూమి హక్కు పత్రాల కోసం ఎంత మంది గిరిజనులు దరఖాస్తులు చేసుకున్నారు, ఎంత మందికి పంపిణీ చేశారు, ఎంత మందికి నిరాకరించారు, అలా నిరాకరించడానికి కారణాలు ఏమిటనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. భూమి హక్కు పత్రాలు పొందని వారిని అడవి నుంచి ఖాళీ చేయించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి, తర్వాత దానిని నిలుపదల…

Read More

టెన్త్ ఫలితాలు ఎలా ఉన్నా పిల్లల్లను నిందించవద్దు: చంద్రబాబు

   న్యూస్ ఇండియా నేషనల్ న్యూస్ నెట్వర్క్…రేపు ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. మంగళవారం విడుదల కానున్న టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో మీ పిల్లల ఫలితాలు ఎలా ఉన్నా వారికి మీ అండ అవసరం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మార్కులు తక్కువ వచ్చాయని వారిని పొరబాటున కూడా నిందించవద్దని, ఇతర పిల్లలతో పోల్చి అవమానకరంగా మాట్లాడొద్దని విజ్ఞప్తి చేశారు. మార్కులు సరిగా రాని పిల్లలను దూషించడం ద్వారా వాళ్ల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు పిల్లల తెలివితేటలకు కొలమానాలు కాదని, కిందపడినా రెట్టించిన ఉత్సాహంతో పైకిలేచే కడలి అలలను స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మళ్లీ ప్రయత్నం చేయడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చంటూ పిల్లల్లో ప్రేరణ…

Read More

కడప, విశాఖ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు..!!

న్యూస్ ఇండియా 24/7నేషనల్ న్యూస్ నెట్వర్క్…. పలు మండలాల్లో పిడుగులు పడొచ్చంటూ సూచన ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విజ్ఞప్తి మీడియాకు వివరాలు తెలిపిన ఆర్టీజీఎస్ ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ (ఆర్టీజీఎస్) కడప, విశాఖ జిల్లాల్లోని పలుప్రాంతాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీచేసింది. మరికొన్ని నిమిషాల్లో కడప జిల్లాలోని కలసపాడు, కాశీనాయన, పోరుమామిళ్ల మండలాలతో పాటు విశాఖ జిల్లాలోని జి.మాడుగుల, అరకు మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ పేర్కొంది. ఆయా మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో పనులు చేసుకునేవాళ్లు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచనలు చేసింది. ఈ మేరకు ఆర్టీజీఎస్ అధికారులు న్యూస్ ఇండియా 24/7నేషనల్ న్యూస్ నెట్వర్క్…. కు వివరాలు తెలిపారు.

Read More