పశ్చిమ బెంగాల్ లో చంద్రబాబు ప్రచారం..

తృణమూల్ కు మద్దతుగా చంద్రబాబు ప్రచారం మమతా బెనర్జీతో కలిసి సభలకు హాజరు! మిత్రధర్మంలో భాగంగా పొరుగు రాష్ట్రాల్లో ప్రచారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మిత్రధర్మంలో భాగంగా పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ కు మద్దతుగా ఆయన రేపు, ఎల్లుండి బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో ప్రచార సభల్లో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం జార్గాం, హల్దియా పట్టణాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. ఎల్లుండి గురువారం ఆయన కోల్ కతా, ఖరగ్ పూర్ నగరాల్లో ప్రచార సభలకు హాజరవుతారు. చంద్రబాబుతో పాటు ఈ సభలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరవుతారని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబునాయుడు కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి కోసం ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో తెలుగువాళ్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఆయన తన…

Read More

సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్టే: రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు

న్యూస్ ఇండియా నేషనల్ న్యూస్ నెట్వర్క్ వివాహితతో యువకుడి సహజీవన మంచి ఉద్యోగం రావడంతో మరో యువతిని పెళ్లాడేందుకు యువకుడు సిద్ధం కుదరదన్న హైకోర్టు ఓ మహిళతో కొన్నాళ్లపాటు సహజీవనం చేసి, ఆ తర్వాత మరో యువతిని పెళ్లాడేందుకు ప్రయత్నించిన వ్యక్తికి రాజస్థాన్ హైకోర్టు షాకిచ్చే తీర్పు చెప్పింది. భారతీయ సమాజంలో సహజీవనం చేయడమంటే పెళ్లి చేసుకున్నట్టుగానే పరిగణించాలని అభిప్రాయపడింది. అంతే తప్ప మరోలా భావించడంలో అర్థం లేదని పేర్కొంది. ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న వివాహితతో అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బలరాంకు స్నేహం కుదిరింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి సహజీవనానికి దారి తీసింది. ఆమెను పెళ్లాడతానని బలరాం మాటివ్వడంతో ఉపాధ్యాయురాలు తన భర్త నుంచి వేరుపడి అతడి వద్దకు వచ్చేసింది. అయితే, ఇటీవల బలరాంకు ఐటీలో మంచి ఉద్యోగం వచ్చింది. దీంతో అతడు…

Read More

ఈదురుగాలులకు కూలిన చెట్టు త్రుటిలో తప్పిన ప్రమాదం ఇద్ద రు, పిల్లలు క్షేమం…!!

బూసిగూడెంలో ఓ ఇంటిపై కూలిపోయిన చింతచెట్టు త్రుటిలో తప్పిన పెనుప్రమాదం… అంధకారంలోబూసిగూడెం… రోడ్లు భవనాల శాఖ అధికారులు నిర్లక్ష్యం… అందుబాటులో లేని విఆర్వో… న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్… రంపచోడవరం మండలంలో  మంగళవారం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బూసిగూడెంలో మంగళవారం మధ్యాహ్నం వీచిన ఈదురు గాలులకు దొడ్డి చిన్న ,వలుగుల లక్ష్మికు చెందిన తాటియాకు,రేకుల ఇంటిపై ఓ చింతచెట్టు కూలిపోయింది. దాంతో ఇల్లు ధ్వంసమైంది. లోపలున్నవలుగుల లక్ష్మి తో పాటు, అమె ఇద్దరు పిల్లలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వారు పెంచుకుంటున్న అరటి చెట్లు నేలమట్టమయ్యాయి. ప్రభుత్వం స్పందించి, తమను ఆదుకోవాలని, ఇంటిని పునర్నిర్మించడానికి తగిన సహాయం చేయాలని వారు కోరుతున్నారు. న్యూస్ ఇండియా నేషనల్ న్యూస్ నెట్వర్క్ తో గ్రామస్తులు…  గ్రామస్తులు రెవెన్యూ అధికారులు కలిస్తే ఇది మా పరిధిలో లేదు అని తప్పించుకున్న వైనాన్ని చూస్తుంటే అమాయక గిరిజనుల…

Read More