కెసిఆర్ ఖబర్దార్… చంద్రబాబు వార్నింగ్..!!

న్యూస్ ఇండియా 24/7 పొలిటికల్ న్యూస్ నెట్వర్క్…ఆంధ్రప్రదేశ్ లోని ప్రజల సమాచారాన్ని హైదరాబాద్ లో ఉన్న ఓ సంస్థ నిర్వహిస్తుంటే, దాన్ని తస్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ‘ఐటీ గ్రిడ్స్’ సంస్థ ఏపీలోని ప్రజల డేటాను బహిర్గతం చేస్తోందన్న ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు దాడులు చేయగా, దీనిపై స్పందించిన చంద్రబాబు, కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తమకు సేవ చేసే కంపెనీని లక్ష్యంగా చేసుకుని దాడులు ఎలా చేస్తారని ప్రశ్నించిన ఆయన, ఈ విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తున్నామని అన్నారు. తానిస్తున్న మర్యాదను కేసీఆర్ తప్పితే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. “మాకు సేవ చేసే కంపెనీపై మీ ఏసీబీ పోలీసులు వచ్చి దౌర్జన్యం చేస్తారా? ఏమనుకున్నారు మీరు? ఇదంత ఈజీగా వదిలిపెట్టను. ఒక పక్క నరేంద్ర మోదీ… దాడులు చేసి…

Read More

చంద్రబాబు ఓ పెద్ద భ్రమలో ఉన్నారు…జేసీ

న్యూస్ ఇండియా24/7 పొలిటికల్ న్యూస్ నెట్వర్క్…రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను, తాను చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఓట్లు వేస్తారని చంద్రబాబు భావిస్తున్నారని, అది కేవలం ఆయన భ్రమేనని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన, తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన కల కంటున్నారని, అదేమంత సులువుకాదని అభిప్రాయపడ్డారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కంటున్న కలలు కల్లలవుతాయని హెచ్చరించారు. నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయని, చంద్రబాబు అనుకుంటున్నట్టుగా ప్రజల్లో సానుకూలత ఏమీ లేదని అన్నారు. ఎమ్మెల్యేలు తామే కలెక్టర్లం, ఎస్పీలం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, వారి వైఖరి ప్రజల్లో అసంతృప్తిని పెంచిందని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందిని మారిస్తేనే ఫలితాలు సానుకూలంగా ఉంటాయని, అయితే, అంత ధైర్యం చంద్రబాబు చేయలేడని…

Read More