టీడీపీలో చేరేందుకు కొణతాల రెడీ.. 28న చంద్రబాబుతో భేటీ

న్యూస్ ఇండియా24/7పొలిటికల్ న్యూస్ నెట్వర్క్…చాలా రోజులుగా వస్తున్న ఊహాగానాలకు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెరదించనున్నారు. త్వరలోనే ఆయన టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. విశాఖపట్టణం రైల్వే జోన్ సహా ఏపీకి జరుగుతున్న అన్యాయంపై తరచూ గళం విప్పుతున్న ఆయన రైల్వే జోన్ కోసం నిర్వహించిన ఆందోళనలోనూ పాల్గొన్నారు. కొణతాల త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు ఊపందుకున్నాయి. వాటికి తెరదించుతూ ఈ నెల 28న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచి టీడీపీ లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబుతో భేటీలో అనకాపల్లి సీటు గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.  

Read More

పవన్ గెలిస్తే సీఎం అవుతాడు. ఓడితే సీఎంకు మొగుడు అవుతాడు – వర్మ

  న్యూస్ ఇండియా 24/7 పొలిటికల్ న్యూస్ నెట్వర్క్…వర్మ ట్వీట్ … మళ్లీ చంద్రబాబుకే పంచ్ ఇచ్చింది. బాబు శతృవులను అందరిని కలుపుతూ… నారాను నట్టేట ముంచేలానే ఉన్నాడు వర్మ. మొన్న జగన్ తనకు మిత్రుడే అన్నట్లు… లక్ష్మీ స్ ఎన్టీఆర్ ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డితో జగన్ కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన వర్మ… ఇప్పుడు పవనిజం పై నాకు నమ్మకముంది బాబును ముప్ప తిప్పలు పెట్టగలిగే ది పవర్ స్టార్, జనసేనానియే అని బల్ల గుద్ది మరి చెప్తున్నాడు. ఇందుకు కారణం బ్రహ్మం గారే స్వయంగా వచ్చి వర్మ గారి చెవిలో ఆ విషయం చెప్పడం. నిజం వర్మ చెవిలో బ్రహ్మం గారు అన్నారట… ఏపీ లో వచ్చే ఎన్నికల్లో గెలిస్తే పవన్ సీఎం అవుతాడు అని… లేదంటే గెలిచిన సీఎంకు మొగుడు అవుతాడని.…

Read More

వైసీపీలోకి.. టీడీపీ మంత్రి తమ్ముడు..,..?

న్యూస్ ఇండియా24/7పొలిటికల్ న్యూస్ నెట్వర్క్…ఆయన ఓ మంత్రి గారు…పాపం గత ఎన్నికల్లో ఓడిపోయినా చంద్రబాబు పట్టుబట్టి .. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకున్నారు . వరుసగా మూడు సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన ఆ సీనియర్ నేత ఈసారైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు . ఇంతలోనే ఆయనకు ఓ షాక్ .. సొంత తమ్ముడే వైసీపీలోకి జంప్ చేసేశాడు . ఇంతకూ ఆ మంత్రి ఎవరో చెప్పలేదు కదూ .. ఆయనే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి . ఆయన సోదరుడు సుధాకర్ రెడ్డి వైసీపీలో చేరారు . దీంతో నెల్లూరు జిల్లా టీడీపీకి షాక్ తగిలినట్టయింది . సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో సుధాకర్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు .   సుధాకర్ రెడ్డితో పాటు కొంతమంది అనుచరులు కూడా పార్టీలో చేరారు . సోమిరెడ్డికి స్వయానా బావ అయిన రామ కోటారెడ్డి వైసీపీలో చేరిన కొద్దిరోజులకే ఆయన సోదరుడు కూడా పార్టీ వీడటం…

Read More

ఏపీలో స్టాఫ్ నర్సు పోస్టులు….

న్యూస్ ఇండియా ఉద్యోగ సమాచారం….ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం 155 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. జోన్ల వారీగా ఖాళీలు : మొదటి జోన్ – 24, రెండో జోన్ – 46, మూడో జోనో – 29, నాలుగో జోన్ – 56 అర్హత : ఇంటర్‌తో పాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ నర్సింగ్ అండ్ మిడ్ వైవ్స్ కౌన్సిల్‌లో శాశ్వత రిజిస్ట్రేషన్ ఉండాలి. వయస్సు : ఓసీ అభ్యర్థులకు 40 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 ఏళ్లు, దివ్యాంగులకు 50 ఏళ్లు మించకూడదు. ఎంపిక : విద్యార్థత మార్కులు, కాంట్రాక్టు నర్సుగా పనిచేసిన అనుభవం ఆధారంగా. దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్‌లో దరఖాస్తు ఫీజు : రూ. 500 (ఎస్సీ, ఎస్టీ,…

Read More