ఉత్తమ్‌, కేటీఆర్‌ మధ్య ఆసక్తికర సన్నివేశం…!!

 న్యూస్ ఇండియా24/7 న్యూస్ నెట్వర్క్… నా ఫోన్‌ నంబర్‌ బ్లాక్‌ చేశావేం…నేనలా చేయగలనా! తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయ్యేందుకు కాంగ్రెస్‌ నాయకులను కలిసేందుకు కేటీఆర్‌ వెళ్లిన సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సీఎల్పీ నేత మల్లుభట్టివిక్రమార్కను ఆయన కార్యాలయంలో కలిసి చర్చలు జరిపిన అనంతరం అక్కడికి పీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ కూడా వచ్చారు. కేటీఆర్‌ ఎదురు పడగానే ‘ఏంటి…నా ఫోన్‌  నంబర్‌ బ్లాక్‌ చేశావు’ అంటూ ఉత్తమకుమార్‌ ప్రశ్నించడంతో తొలుత ఆశ్చర్యపోయిన కేటీఆర్‌ ‘అయ్యో అదేం మాట…మీ నంబర్‌ని నేను బ్లాక్‌ చేయగలనా’ అంటూ సమాధానం ఇవ్వడంతో ఇద్దరు నాయకులు నవ్వుకున్నారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ మాట్లాడుతూ తాను ఫోన్‌లో ఎక్కువగా మెసేజ్‌లే చూస్తుంటానని, అంతకు మించి ఏమీ చేయనని తెలపడంతో ఇద్దరు నేతలతోపాటు భట్టికూడా నవ్వుకున్నారు.

Read More

రాజీనామా యోచనలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా!

న్యూస్ ఇండియా24/7 న్యూస్ నెట్వర్క్…టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా ఉన్నట్టు తెలుస్తోంది. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదని భావిస్తున్న ఆయన టీడీపీ అధిష్ఠానం వైఖరి పట్ల ఆగ్రహంతో ఉన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి సైతం రాజీనామా చేసే యోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ కోసం తన సీటును త్యాగం చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి వచ్చిన నేతలకు టికెట్ కేటాయిస్తూ తనను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ నాగుల్ మీరా వాపోయారు. కనీసం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా తనను సంప్రదించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటి నేపథ్యంలో ఆయన రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. దీనిపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Read More