గిరిజనులకు చంద్రబాబు వరాల జల్లు

న్యూస్ ఇండియా27/7 న్యూస్ నెట్వర్క్…తెలుగుదేశం ప్రభుత్వం గిరిజనుల  అభ్యున్నతికి కృషి చేస్తూ ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టింది. గిరిజనులకు నేనున్నాను అంటూ  పెద్దన్న పాత్ర పోషించారు చంద్రబాబు,  వారి రుణం తీర్చుకునే భాగంగా… చంద్రబాబు గిరిజనులకు వృద్ధాప్య పింఛను వయోపరిమితిని తగ్గించారు, ప్రస్తుతం అన్ని వర్గాల వారికి వృద్ధాప్యంలో పింఛను పొందడానికి వయోపరిమితి 65 ఏళ్లుగా ఉంది. అయితే గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణ అభివృద్ధి శాఖ జీవో ఎంఎస్ నెంబర్ 49 ని ఆదివారం రాత్రి విడుదల చేసింది. అర్హులైన వారి వివరాలను సేకరించాలని మండల పరిషత్ అధికారులకు సర్ఫ్ ఆదేశాలు జారీ చేసింది.

Read More