జగన్ వ్యూహం అదిరింది…!!

న్యూస్ ఇండియా24/7 పొలిటికల్ న్యూస్ నెట్వర్క్.. వైఎస్ జగన్ వ్యూహాలు నలభయ్యేళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబునుపదే పదే కలవరపెడుతున్నాయి. హామీలు ఇవ్వడంలో కానీ, పోరాటాలు చేయడంలో కానీ బాబు జగన్ని అనుసరిస్తున్నారని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఇక జగన్ తనదైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. వాటి ఫలితాలు కూడా ఆయనకే లాభించేలా ఉన్నాయి.     నిజానికి జగన్ బీసీ గర్జన నిర్వహించి బీసీల డిక్లరేషన్ ప్రకటిస్తామని చాలా ముందుగానే చెప్పుకొచ్చారు. ఇది పాదయాత్రలో ఎప్పటికపుడు జగన్ చెబుతూనే ఉన్నారు. అయితే హడావుడిగా ఎన్నికలు దగ్గరలో ఉన్నాయనగా టీడీపీ ఆద్వర్యంలో జయహో బీసీ అంటూ చంద్రబాబు ఓ మీటింగు పెట్టి బీసీలంతా తమవైపే అని ఆర్భాటం చేశారు. ఇపుడు జగన్ ముందే చెప్పినట్లుగా బీసీ గర్జన నిర్వహిస్తున్నారు. ఈ నెల 17న నిర్వహిస్తున్న బీసీ గర్జన నిజంగా ఓ రికార్డ్…

Read More

ప్రధానికి స్వాగతం పలకవద్దని సీఎంవో…నిర్ణయం..!!

న్యూస్ ఇండియా24/7 పొలిటికల్ న్యూస్ నెట్వర్క్…(అమరావతి)నేడు రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి స్వాగతం పలకవద్దని ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు నిర్ణయించారు. అలాగే కృష్ణపట్నం కోస్టల్‌ ఇన్‌స్టలేషన్‌ శంకుస్థాపనతోపాటు, క్రూడాయిల్‌ స్టోరేజ్‌ ఫెసిలిటీ జాతికి అంకితం కార్యక్రమానికి కూడా హాజరుకావద్దని నిర్ణయించారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి పర్యటన కార్యక్రమ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం ఇవ్వలేదని సమాచారం. ఈ నేపధ్యంలోనే ప్రధాని కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీఎంవోపాటు మంత్రులు నిర్ణయించుకున్నారు.

Read More

ఇరిడియం,రైస్‌ పుల్లింగ్‌ ఆశచూపి..”కోట్లు” దోచేశారు

న్యూస్ ఇండియా24/7 క్రైమ్ న్యూస్ నెట్వర్క్….  ఆధ్యాత్మిక శక్తులు, నాగ బంధం కలిగిన వస్తువు ,ఇరిడియం,రైస్‌ పుల్లింగ్‌ … అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.1000 కోట్ల విలువ ఉంటుంది… దీన్ని మీరు తీసుకుంటే దైవ శక్తులు రావడంతోపాటు వేల కోట్లు సంపాదిస్తారు… ఇలా భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తిని నమ్మించి రూ.41.85 లక్షలు టోకరా వేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఏడుగురు సభ్యుల ముఠాను రాచకొండ భువనగిరి ఎస్‌ఓటీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మరో నిందితు డు పరారీలో ఉన్నాడు. ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ నిందితుల వివరాలు వెల్లడించారు. యాదాద్రి సమీపంలోని కూనూరుకు చెందిన మదను మోక్ష రాజు(37) అనేక పేర్లతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నాడు. అంతర్జాతీయ మార్కెట్లో రూ.వేల కోట్లు విలువచేసే రైస్‌ పుల్లింగ్‌ పరికరాన్ని రూ.లక్షల్లోనే అమ్ముతానంటూ తాడేపల్లి…

Read More