లంచ తీసుకుంటూ పట్టుబడిన వీఆర్వో

 న్యూస్ నెట్వర్క్24/7 క్రైమ్ న్యూస్ నెట్వర్క్  ( ఖమ్మం)  జిల్లాకు చెందిన కలకోడ గ్రామ వీఆర్వో శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కారు. పట్టా పాసుపుస్తకం కోసం రూ. ఐదు వేల లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. వల పన్నిన అవినీతి నిరోదక శాఖ అధికారులు బాధితుడి నుంచి వీఆర్వో లంచం తీసుకుంటుండగా పట్టుకుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Read More

పసుపు- కుంకుమ డబ్బుల్లో చేతివాటం…!!

న్యూస్ నెట్వర్క్ 24/7పొలిటికల్ న్యూస్ నెట్వర్క్… ‘పసుపు-కుంకుమ’లో  వసూల్‌ రాణిలు  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మహిళలకు పసుపు-కుంకుమ పేరుతో నిర్వహించిన కార్యక్రమం కొందరి చర్యల వల్ల విమర్శల పాలవుతోంది. బ్యాంకు అధికారులు డబ్బులు ఇవ్వటంలో జాప్యం చేస్తున్నట్లు, కొన్నిచోట్ల బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ లేదని దానికి కొంత జమ చేస్తున్నామని చెబుతున్నట్లు మహిళల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా మెప్మాలో రీ సోర్స్‌పర్సన్‌లు మహిళలకు వచ్చే రూ.2,500 కొంత తమకు ఇవ్వాలని వసూలు చేస్తున్నట్లు మార్కాపురంలో వినిపిస్తున్నది. పట్టణంలో మొత్తం 1194 గ్రూపుల సభ్యులకు పసుపు,కుంకుమ పథకం కింద చెక్కులు మంజూరయ్యాయి. వారిలో 1,148 మందికి చెక్కులు పంపిణీ చేశారు. వారు బ్యాంకుల వద్దకు వెళ్లగానే చెక్కులు మార్చుకునే సమయంలో ఉచితంగా వచ్చిన డబ్బులే కదా? మేము తీర్మానాలు రాయటం దగ్గర నుంచి మీకు అన్ని…

Read More

After no show by 4 MLA, Karnataka Congress takes the anti-defection route

THE NEWS INDIA 24/7 NEWS NET WORK…Bengaluru, Feb 08: It appears as though the Karnataka Congress is fed up of waiting for its missing MLAs to turn up. Despite a whip being issued, some of its leaders failed to turn up at both the Congress Legislature Party meeting and the budget session. Now, the Congress has decided to request the Speaker to suspend the dissenting legislatures. The four legislators against whom action would be sought are Ramesh Jarkiholi, Umesh Jadhav, Mahesh Kumathahalli and B Nagendra.

Read More

అగ్రవర్ణాల రిజర్వేషన్ ను నిలిపివేయండి.. సుప్రీంకోర్టులో మరో పిటిషన్.. !!

న్యూస్ ఇండియా 24/7న్యూస్ నెట్వర్క్…దేశంలోని అగ్రవర్ణాల పేదలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్ పై స్టే విధించాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది. ప్రముఖ ఉద్యమకారుడు తెహసీన్ పూనావాలా ఈరోజు దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. రిజర్వేషన్లను నిలుపుదల చేసేందుకు నిరాకరించింది. ఈ విషయమై స్పందనను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో ‘జన్‌హిత్ అభియాన్‌’, ‘యూత్ ఫర్ ఈక్వాలిటీ’ అనే స్వచ్ఛంద సంస్థలు రిజర్వేషన్ కోటాను సవాలుచేస్తూ దాఖలు చేసిన పిటిషన్లతో దీన్ని కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Read More