రూ.15 లక్షల విలువైన గంజాయి పట్టివేత

న్యూస్ ఇండియా24/7 క్రైమ్ న్యూస్ నెట్వర్క్…..(మోతుగూడెం) ఒడిశా నుంచి భద్రాచలం వైపు కారులో తరలిస్తున్న రూ.15 లక్షల విలువైన వంద కిలోల గంజాయిని మోతుగూడెం పోలీసులు పట్టుకున్నారు. సీఐ దుర్గాప్రసాద్‌, ఎస్సై మనోహర్‌జోషి తెలిపిన వివరాల ప్రకారం…ఒడిశా నుంచి భద్రాచలం పట్టణానికి కారులో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో మంగళవారం సాయంత్రం మోతుగూడెం వెదురు డిపో వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. సీలేరు నుంచి వస్తున్న కారుపై అనుమానం రావడంతో ఆపి పరిశీలించగా అందులో గంజాయి ప్యాకెట్లు లభించాయి. వాటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఒడిశా రాష్ట్రం రాసబెడ గ్రామానికి చెందిన ముదిలి మంగరాజు, దుప్పిలవాడకు చెందిన వంతల మిసాబ్రాను అరెస్టు చేశారు. గంజాయిని స్వాధీనం చేసుకుని కారును సీజ్‌ చేశారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుళ్లు సత్యనారాయణ, శ్రీరామ్‌, వీఆర్వో రాజయ్య తదితరులు…

Read More

డ్వాక్రా సొమ్ము వెలుగుసిబ్బంది స్వాహా..?

   న్యూస్ ఇండియా24/7 క్రైమ్ న్యూస్ నెట్వర్క్…. స్వయం సహాయక సంఘాలు పొదుపు చేసిన సొమ్మును వెలుగుసిబ్బంది స్వాహా చేశారంటూ బాధితులు మంగళవారం పెద్దఎత్తున రోడ్లపై బైఠాయించడం ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే సీతానగరం మండలంలోని మునికూడలి పరిధిలోని వీవోఏ సునీత, సమాఖ్య అధ్యక్షురాలిగా పనిచేస్తున్న పోశిరత్నం సమృద్ధి, స్త్రీనిధులను సుమారుగా రూ.15 లక్షలు స్వాహా చేసిన సీతానగరం వెలుగు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని డ్వాక్రా సంఘాల సభ్యులు వారంరోజుల క్రితం డీఆర్‌డీఏకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా స్త్రీనిధి మేనేజర్‌ జి.ప్రసన్నలక్ష్మిని విచారణాధికారిగా నియమించారు. ఆమె ఆధ్వర్యంలో మంగళవారం సీతానగరంలోని స్త్రీశక్తి భవనంలో నిధుల స్వాహాపై విచారణ చేపట్టగా బాధిత డ్వాక్రా సంఘాల మహిళలు హాజరయ్యారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వీవోఏ, సమాఖ్య అధ్యక్షురాలు విచారణకు రాలేదు. దీంతో విచారణాధికారి ప్రసన్నలక్ష్మి చరవాణి…

Read More

తొలి పార్లమెంటరీ కమిటీని ప్రకటించిన పవన్..

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఓవైపు పార్టీ నిర్మాణంపై దృష్టిపెడుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఓవైపు పార్టీలో వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తున్న ఆయన… మరోవైపు అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు. ఇక ఇవాళ జనసేన తొలి పార్లమెంటరీ కమిటీని ప్రటించారు పవన్ కల్యాణ్. నరసాపురం పార్లమెంటరీ కమిటీని 50 మంది సభ్యులతో నియమించారు. రేపు మరో ఐదు కమిటీలను ప్రకటించనున్నారు జనసేన అధినేత. ఈ కమిటీకి రీజనల్ సెక్రటరీగా బొమ్మదేవర శ్రీధర్, కార్యదర్శిగా సూర్యారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శలుగా కనకరాజు సూరి, యర్రా నవీన్, వైఎస్ చైర్మన్‌గా పోలిశెట్టి వాసు, కోశాధికారిగా శ్రీ పిళ్లా నారాయణమూర్తి, అధికార ప్రతినిధులుగా చేగొండి సూర్యప్రకాశరావు, పాదం మూర్తి నాయుడు, అనుకుల రమేష్‌, ఇంటలెక్చువల్ కౌన్సిల్‌కి చినుమిల్లి శ్రీకృష్ణ అప్పాజీ, లీగల్ విభాగానికి…

Read More

మరో కేసులో జగన్ కు క్లీన్ చిట్

న్యూస్ ఇండియా నేషనల్ న్యూస్ నెట్వర్క్…..షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ఒక్కో కేసు వీగిపోతోంది. తాజాగా ఇండియా సిమెంట్స్ కు నీటి కేటాయింపులపై ఉన్న కేసును హై కోర్టు కొట్టేసింది. అక్రమాలకు పాల్పడ్డారంటూ నమోదైన చాలా కేసుల్లో ఇప్పటికే జగన్ కు క్లీన్ చిట్ వచ్చిన విషయం తెలిసిందే. ఇండియా సిమెంట్స్ కు నీటి కేటాయింపుల్లో ఎటువంటి అవినీతి, అక్రమం జరగలేదని రాష్ట్రప్రభుత్వం సుప్రింకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా హై కోర్టు కేసును కొట్టేసింది. ఇండియా సిమెంట్స్ కు నీటి కేటాయింపుల్లో అవినీతి జరిగిందని, అక్రమాలు జరిగాయని ఏసిబి అప్పటి ప్రిన్సిపుల్ కార్యదర్శి ఆదిత్య నాద్ దాస్ పై కేసు నమోదు చేసింది. అదే విధంగా ఇండియా సిమెంట్స్ కు నీటి కేటాయింపుల్లో జగనే ప్రధాన లబ్దిదారని కూడా ఏసిబి వాదిస్తోంది.…

Read More