ఫెడరల్ ఫ్రంట్: కేసీఆర్‌పై బాబు సెటైర్లు..

న్యూస్ ఇండియా పొలిటికల్ న్యూస్ నెట్వర్క్..అమరావతి: దేశంలో బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కూటములే ఉంటాయని, మూడో ఫ్రంట్ అనేది ఎలా సాధ్యమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ ఏర్పాటు చేయతలపెట్టిన ఫ్రంట్‌పై బాబు విమర్శలు గుప్పించారు. గురువారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా లేదా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫ్రంట్‌లు ఉంటాయన్నారు. మరో ఫ్రంట్ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రాక్టీకల్‌గా మాట్లాడాలని ఆయన సూచించారు. మాయావతిలు కూడ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే వారంతా కాంగ్రెస్ ఫ్రంట్‌లో చేరాలని బాబు కోరారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ బెంగాల్, ఒడిశా సీఎలతో భేటీ అయ్యారు. అఖిలేష్…

Read More

మహాత్మగాంధీతో కేటీఆర్‌ను పోల్చి.. వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్లో

న్యూస్ ఇండియా  24/7 పొలిటికల్ న్యూస్ నెట్వర్క్….వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తారలు పోటెత్తారు. ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించిన నటి హేమ కూడా ఈ కార్యక్రమానికి హాజయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురించి ఓ వీడియోను ప్రదర్శించారు. ఆ వీడియోలో మహాత్మగాంధీతో కేటీఆర్‌తో పోల్చడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. విదేశాల నుంచి స్వదేశానికి  విదేశాల నుంచి స్వదేశానికి వచ్చినమహాత్మ గాంధీజీ, కేటీఆర్‌ జీవితాలను పోల్చుతూ ఆ వీడియోను ప్రదర్శించారు. జాతీయోద్యమం సందర్భంగా దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి గాంధీజీ తిరిగి వచ్చాడు. అలాగే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతుంటే అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి తెలంగాణకు కేటీఆర్ తిరిగి వచ్చారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ…

Read More

చరణ్ స్పీచ్ బాగుంది.. కేటీఆర్ ప్రశంసలు..!!

న్యూస్ ఇండియా 24/7  సినిమా న్యూస్ నెట్వర్క్….భవిష్యత్తులో ఏనాటికైనా రామ్ చరణ్ కూడా రాజకీయాల్లోకి వస్తాడనిపిస్తోందని టీఆర్ఎస్ యువనేత కేటీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం రాత్రి హైదరాబాద్, యూసఫ్ గూడలో ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగగా, ముఖ్య అతిథిగా వచ్చిన కేటీఆర్ ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “నాకైతే ఇప్పుడు చరణ్ స్పీచ్ వింటుంటే… ఏమీ మరచిపోయినట్టు అనిపించలేదు. అన్నీ చెప్పాడు. ఇంకా చెప్పాలంటే, మేము ఎలక్షన్లలో స్పీచ్ లు ఇచ్చిన దానికంటే బాగానే మాట్లాడాడని చెప్పవచ్చు. నా డౌట్ ఏంటంటే… ఫ్యూచర్లో ఎప్పుడో… ఇప్పుడే కాదు… ఇప్పుడే కాదు… టైముంది… టైముంది” అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలతో మెగా ఫ్యామిలీ అభిమానులు కేరింతలు కొట్టారు.

Read More