త్రిముఖం..ఆసక్తికరం

న్యూస్ ఇండియా 24 / 7 న్యూస్ నెట్వర్క్…ఖైరతాబాద్ కోటలో పాగాకు యత్నిస్తున్న గులాబీ దళం- జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తాచాటిన టీఆర్‌ఎస్ -మైనార్టీల మద్దతే కీలకం బంజారాహిల్స్ ఒకప్పుడు అతిపెద్ద నియోజకవర్గంగా పేరొందిన ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలు అంటే ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరున్న ఈ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేసే లక్ష్యంతో సీనియర్ నేత దానం నాగేందర్‌ను టీఆర్‌ఎస్ పార్టీ బరిలో దింపింది. మూడునెలలుగా అంతర్గత సమావేశాలతో క్యాడర్‌ను సమీకరించుకున్న దానం నాగేందర్ ప్రచారంలో తనదైనశైలిలో దూసుకుపోతున్నారు. గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, మంత్రిగా కూడా పనిచేసిన నేపథ్యంలో తనకున్న పరిచయాలు, టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారాస్ర్తాలుగా మార్చుకొని గెలుపు కోసం కృషి చేస్తున్నారు.పాదయాత్రలు, రోడ్‌షోలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రధాన సమస్యలు పరిష్కారం : ఖైరతాబాద్ బీజేపీ…

Read More

ప్రజలు గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లకపోవడం దారుణం.. వైసీపీకి చురకలు

రాజకీయాల్లో మార్పులు తీసుకురాగలిగే శక్తి ప్రజలకే ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నాయకులను ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయ నేతలు నిసిగ్గుగా పార్టీలు ఫిరాయిస్తున్నారని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధోరణి ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లాలోని సర్ణభారత్ ట్రస్టులో వేర్వేరు రంగాలు ప్రముఖులు, మీడియా ప్రతినిధులతో ఈరోజు వెంకయ్య అల్పాహార సమావేశం నిర్వహించారు. పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్లు అలసత్వం వహించడం సరికాదని వెంకయ్య అన్నారు. ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు సభలకు వెళ్లకపోవడం దారుణమని పరోక్షంగా వైసీపీ నేతలను ప్రస్తావించారు. ఎన్నికల నేపథ్యంలో నేతలు ఇస్తున్న హామీలు చూస్తుంటే దిమ్మతిరుగుతోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి హామీలు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆర్థిక నేరగాళ్లు దేశం దాటకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఎన్నికల్లో…

Read More

వరుస తప్పులతో కేసీఆర్ సెల్ఫ్ గోల్

తెలంగాణ ఎన్నిక‌ల్లో ప్ర‌జాకూట‌మిలో రాహుల్‌-చంద్ర‌బాబుల కంటే కూడా రేవంత్ రెడ్డి ఎక్కువ పాపుల‌ర్ అయ్యారు. కేసీఆర్ కు పోటీగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరుగుతూ ప్ర‌జాకూట‌మి అభ్యర్థుల త‌ర‌ఫున ఆయ‌న ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముందు నుంచి తెలంగాణ‌లో కేసీఆర్‌కు మింగుడ‌ప‌డ‌ని వ్య‌క్తి రేవంత్‌. రాజ‌కీయంగా అత‌ని అడ్డు తొలగించుకోవ‌డానికి కేసీఆర్, రేవంత్‌ను బ‌ల‌హీన పర‌చ‌డానికి కేసీఆర్ ఎప్ప‌టిక‌పుడు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా చాలా త‌ప్పులు చేశారు. కేసీఆర్ చేసిన ప్ర‌తిప్ర‌య‌త్నం రేవంత్ ను మ‌రింత పాపుల‌ర్ చేస్తూనే వస్తోంది. కొడంగ‌ల్‌లో స‌భ పెట్టుకున్న కేసీఆర్‌… రేవంత్ ఉండ‌గా తాను స‌భ స‌క్సెస్ చేయలేన‌ని భావించి ముంద‌స్తుగా పార్టీ కేడ‌ర్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి అరెస్టు చేయించారు. సాధార‌ణంగా ఇలాంటి సంద‌ర్భాల్లో కేవ‌లం గృహ‌నిర్బంధం చేస్తారు. అయితే, గృహ నిర్బంధంతో రేవంత్ అనుచ‌రుల‌ను త‌ట్టుకోలేమ‌ని భావించిన కేసీఆర్‌… చాలా…

Read More

రాజకీయాల కోసమే ముందస్తు… తేల్చి చెప్పిన గులాబీ బాస్

తెలంగాణ అసెంబ్లీ ఎందుకు ర‌ద్దు చేశారు..? ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఎందుకు కేసీఆర్ వెళ్లారు..? నిజానికి, ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తెరాస నుంచి ల‌భించ‌కుండానే… ఎన్నిక‌ల ప్ర‌క్రియ కూడా పూర్తికాబోతున్న స‌మ‌యం వ‌చ్చింది. అయితే, ఇదే అంశ‌మై మొద‌ట్నుంచీ కేసీఆర్ గానీ, ఇత‌ర తెరాస నేత‌లుగానీ చెప్పిన కార‌ణం ఏంటంటే… కాంగ్రెస్ పార్టీ తీరు! తాము చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకుంటున్నార‌నీ, కేసులు వేస్తున్నార‌నీ, అందుకే ప్ర‌జ‌ల నుంచే మ‌రోసారి ఆమోదం పొందాల‌నే ఉద్దేశంతోనే అసెంబ్లీ ర‌ద్దు చేశామని కేసీఆర్ చెబుతూ వ‌చ్చారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా అదే ప్రముఖంగా ప్ర‌జ‌ల‌కు చెప్పారు. అయితే, ఒక జాతీయ వార్తా సంస్థ‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఏమ‌న్నారంటే… ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి కార‌ణం.. త‌న జాతీయ రాజ‌కీయ ఆలోచ‌న‌లే అన్నారు. అసెంబ్లీ ర‌ద్దుకి కార‌ణ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తే… ముందుగా…

Read More